గుంతకల్లు, (జనస్వరం) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన కౌలురైతు భరోసా యాత్రను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేసేందుకు గుంతకల్లు జనసైనికులు, నాయకులు తయారు చేయించిన గోడపత్రికలను ఆవిష్కరించడం జరిగింది. తదనంతరం జనసైనికులు సహకారంతో గుంతకల్లు పట్టణంలోని వివిధ చోట్ల గోడ పత్రికలును అతికించడం జరిగింది. అనంతరం వాసగిరి మణికంఠ మాట్లాడుతూ జనసేన అధినేత పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన పడుతున్న తపన, కౌలు రైతుల సంక్షేమం కోసం ఆయన ప్రారంభించిన కౌలు రైతుల భరోసా యాత్ర, కార్యకర్తల కోసం ఆయన తీసుకువచ్చిన క్రీయాశీలక సభ్యత్వం (5 లక్షల ప్రమాదబీమా) లాంటి కార్యక్రమాలను ప్రజలందరికీ తెలియజేసే విధంగా అలాగే 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభుత్వ ఏర్పాటే ధ్యేయంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు సంధ్యా, సుజాత, ఈరమ్మ, మాధవి జనసేన పార్టీ సీనియర్ నాయకులు బండి శేఖర్, సుబ్బయ్య, పాండు కుమార్, దాదు జిల్లా కార్యనిర్వాహక కమిటీ సభ్యులు పవర్ శేఖర్, ఎస్ కృష్ణ నిస్వార్థ జనసైనికులు పామయ్య, మంజునాథ్, రమేష్ రాజ్, రవితేజ, ఆటో రామకృష్ణ, అమర్నాథ్, సంజీవ్, కొనకొండ్ల శివ, రంగా, సత్తి , శివ, తిమ్మాపురం శివ, కాజా, దాదా, మధు, సూరి, మధు, శీనా, ఆటో పాండు, కసాపురం నంద, వంశీ, ముత్తు, మంజు తదితరులు పాల్గొన్నారు.