
తిరుపతి, (జనస్వరం) : జనసేన పార్టీ మహిళా విభాగం రాయలసీమ మహిళా ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా తిరుపతిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత పాల్గొని అక్కడ నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ సమాజంలో మహిళల ప్రాధాన్యతను వివరిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో మహిళలకు సముచితమైన స్థానం కల్పించారని తెలియజేస్తూ, ప్రస్తుతం ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో మహిళలపై అత్యాచారాలు దాడులు ఎక్కువయ్యాయని ప్రభుత్వం వీటిని నివారించి మహిళలకి రక్షణ కల్పించాల్సినదిపోయి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని రాష్ట్రంలో రక్షణ వ్యవస్థ కూడా వైసిపి కీలుబొమ్మలుగా వ్యవహరిస్తున్నారని, గోరంట్ల తేజస్వినిపై జరిగిన అత్యాచార హత్యని ఆత్మహత్యగా పోలీసులు చిత్రీకరించారని తెలిపారు. జనసేన పార్టీ తేజస్విని కుటుంబానికి అండగా ఉండి రీపోస్ట్ మార్టం చేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయగా అప్పుడు రీపోస్టుమార్టం చేసి పోలీసులు అత్యాచారంగా తేల్చారని తెలియజేశారు. ప్రజలకు మంచి, మహిళలకు రక్షణ కల్పించాలంటే జనసేన పార్టీతోనే సాధ్యమని కనుక గ్రామస్థాయి నుంచి జనసేన పార్టీ కోసం కష్టపడి పార్టీని బలోపేతం చేసి 2024 వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని తెలియజేశారు. అనంతరం పెండ్యాల శ్రీలతని రాయలసీమ మహిళా ప్రాంతీయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్, రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యురాళ్లు ఆకుల వనజా గారు, జ్యోతి గారు, శ్రీకాళహస్తి ఇంచార్జ్ వినుతా, సుహాసిని, మమత, తిరుపతి ఇంఛార్జ్ కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి, వీర మహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొనడం జరిగింది.