జగ్గంపేట ( జనస్వరం ) : ప్రపంచ నర్సుల దినోత్సవ సందర్భంగా జగ్గంపేట జనసేన ఇంచార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్ర, ఆయన సతీమణి నర్సులను గౌరవించారు. ఆయన మాట్లాడుతూ నర్సులు డ్యూటీకి వచ్చింది మొదలు డ్యూటీ దిగి వెళ్ళే వరకు అలుపు ఆయాసం లేకుండా, విసుగూ విరామం లేకుండా, క్షణం విశ్రాంతి తీసుకోకుండా ప్రాణాలున్న మరబొమ్మల్లా పనిచేస్తారు. వారు చేసే సేవలు అమూల్యమైనవన్నారు. ఆస్పత్రిలో సందడిగా తిరిగే నర్సులు జీవితంలో సమస్యలెన్నో, సంగ్రామ భేరీలు మోగిస్తూ మనశ్శాంతిగా ఉండనివ్వవు. షిఫ్ట్‌లలో పనిచేస్తూ వేళకు తిండిలేక, సమయానికి నిద్రలేక, పరామర్శించే పరిస్థితిలేక, సమాజంలో చెప్పుకోదగ్గ గుర్తింపులేక, చాలీచాలని జీతాలతో జీవితాలను బొటాబొటిగా గడుపుతుంటారన్నారు. కటాకటిగా నడిపించే అభిశప్త జీవనులు నర్సులు. వారి కళ్ళు నవ్వుతున్నా ఆ నవ్వుల మాటున ఎన్నో జాలి కథలూ వెతలూ దోబూచులాడుతుంటాయని అన్నారు. కరోనా విపత్కర సమయంలో నర్సులు సేవలు ఎనలేనివి. ఆసమయంలో నర్సులు అందించిన సేవలు మరువలేనివి, అందుకే ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా వారిని జనసేనపార్టీ తరుపున సత్కరించడం గొప్ప అవకాశామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, నర్సులు తదితరులు పాల్గొన్నారు.