అరకు ( జనస్వరం ) : గిరిజన జాతికి రక్షణ కోసమైన పిసా చట్టాన్ని మరియు 5వ షెడ్యూల్ ఉన్న ప్రకారంగా కాకుండా మైనింగ్ మాఫియా అరికట్టాలని నిమ్మలపాడు జనసేన పార్టీ మండల అధ్యక్షులు చిట్టం మురళి డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ నిమ్మలపాడు కాల్ సెట్ మైనింగ్ ఇష్టం వచ్చినట్టు తీయడం చట్ట విరోధం అని, దీనికి కారకులైన వారిపై పోరాటానికి జనసేన పార్టీ పోరాటానికి వెనుకంజ వెయ్యదని అన్నారు. అలాగే పంచాయతీకి 20శాతం కట్టాలనే నిబంధన, పిసా చట్టానికి వ్యతిరేకంగా ఉన్నా రెవెన్యూ అధికారులు సమాధానం చెప్పాలని అన్నారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజనులు మీద తమ వైఖరి స్పష్టముగా చెప్పాలని జగన్మోహన్ రెడ్డిని పత్రికాముఖంగా కోరారు. గిరిజనుల చట్టాలకు అవగాహన ఉందో లేదో తెలియడం లేదు. నిజంగా గిరిజనుల మీద ప్రేమ ఉంటే 5వ షెడ్యూల్ ప్రాంతమైన కాల్ సెట్ మైనింగ్ లో జరుగుతున్న అక్రమాన్ని విచారించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు శ్రీరామ్ మూర్తి పాల్గొన్నారు.