చిత్తూరు, (జనస్వరం) : వైసీపీ అధికారంలోకి రాగానే అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు, చదివిన చదువులను పరిగణనలోకి తీసుకుంటాం. కాంట్రాక్టులో పనిచేస్తున్న వారిలో వీలైనంత ఎక్కువమందిని రెగ్యులరైజ్ చేస్తామని ముఖ్యమంత్రి పాదయాత్రలో హామీ ఇచ్చారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను వారి అర్హత సర్వీస్ ను బట్టి వీలైనంత మందిని రెగ్యులరైజ్ చేస్తాం అని కూడా చెప్పారు. ఎన్నికలకు ముందు విడుదల చేసిన మేనిఫెస్టోలోని ప్రతి మాటను నిలబెటకపోగా ప్రజలను నానా విధాలుగా బాధలకు గురి చేస్తున్నారని అనిత అన్నారు. ఒకసారి మంత్రుల కమిటీ వారికి సలహాలు ఇచ్చేందుకు మరో అధికారులు కమిటీ ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు తప్పా! ఇంత వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. పక్కనున్న తెలంగాణలో ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మన రాష్ట్రంలో మినిమం టైం స్కేల్ అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న రెగ్యులర్ ఉద్యోగులకు లభించే సదుపాయాలు కాంట్రాక్టు వారికి అందడం లేదు. ప్రభుత్వంలో 13,671 మంది ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేషన్లు కలిపితే 50 వేల వరకు ఒప్పంద ఉద్యోగులు ఉంటారు. మంత్రుల కమిటీ ఏర్పాటు చేసి దాదాపు మూడేళ్లు అధికారుల కమిటీ నివేదిక సమర్పించే గడువు మరో రెండేళ్లు అవుతోంది. ఇంతవరకు దీనిపై నిర్ణయం తీసుకోలేదు. అధికారంలోకి వస్తే రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇవ్వడంతో నమ్మి వెంట నడిచిన కాంట్రాక్టు ఉద్యోగులకు ఎదురుచూపులు మాత్రమే మిగిలాయని వాపోయారు. వైద్య ఆరోగ్య శాఖలో కొందరు పదవి విరమణ పొందుతున్నారు. ఎలాంటి ప్రయోజనాలు అందడం లేదు. ప్రభుత్వంలో పని చేసే వారిలో అత్యధికంగా 6400 మంది వరకు బోధన విభాగంలోనే ఉన్నారు. వీరికి ఏడాదికి పది సెలవులు మాత్రమే ఇస్తున్నారు. ప్రతి ఏటా ఏప్రిల్ వచ్చేసరికి సర్వీసు పునరుద్దరణ అవుతుందో లేదో అని ఎదురు చూడాల్సిన దుస్థితి వస్తోంది. PF సదుపాయం లేదు. ఆరోగ్యకార్డులు ఇవ్వడం లేదు. ఇది మన రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులకు చేసిన న్యాయమని మండిపడ్డారు.