నెల్లూరు, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి సూచనతో జిల్లా మహిళా కన్వీనర్ కోలా విజయలక్ష్మి ఆధ్వర్యంలో మహిళా కమిటీ సమావేశం జిల్లా కార్యాలయంలో జరిగింది. దాదాపు వంద మంది మహిళలు సమావేశమైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు, గ్యాస్ ధరలు, కరెంటు చార్జీలు ఆకాశాన్ని అంటుతున్నాయని వీటిపై మహిళలు నిరసనలు చేపట్టాలని సూచించారు. అలాగే మద్యపాన నిషేధం అమలు చేస్తామన్న ప్రభుత్వం దాని ఊసే లేదని గతంలో నెల్లూరు జిల్లా కేంద్రంగా మొదలైన మద్యపాన నిషేధం ఉద్యమం రాష్ట్రమంతా కదం తొక్కే టట్లు చేసిందని గుర్తు చేస్తూ జనసేన పార్టీ తరఫున మహిళల జరుగుతున్న అగడాలను ప్రతిఘటించాలని వారికి అండగా జనసేన పార్టీ నాయకులు తోడుగా నిలబడుతారని తెలిపారు. ముద్దు పెట్టే అన్న వద్దు..
ముద్ద పెట్టే అన్నకి ఓటెయ్యండి అంటూ రాష్ట్రం అభివృద్ధి పడాలంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలని దానికనుగుణంగా అందరూ పని చేసుకోవాలని నిర్దేశించారు. ఈ సమావేశంలో నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి వచ్చిన మహిళ కార్యకర్తలు, మహిళా కన్వీనర్ రావి సౌజన్య, బి పార్వతి నాయుడు, బొందుల శ్రీదేవి, జిల్లా కమిటీ సభ్యులు సుకన్య, సిందూర, రాధమ్మ, గునుకుల కిషోర్, దుగ్గిసెట్టి సుజయ్ తదితరులు పాల్గొన్నారు.