అనంతపురం, (జనస్వరం) : సజ్జల రామకృష్ణారెడ్డి మీరు కేవలం ప్రభుత్వ సలహాదారుడు మాత్రమే? మీరు జీతం తీసుకుని మైకుల ముందుకు వచ్చి ప్రతిపక్షాలను, పాలసీల గురించి మాట్లాడడం తప్పు? రాజ్యాంగ విరుద్ధం? అని జయరామిరెడ్డి అన్నారు. మూడు వేల కోట్లు రైతు స్థిరీకరణ నిధి ఉంది అని చెప్పారు ఆ డబ్బంతా ఏమై పోయింది? మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 43 నంబర్ GO తెచ్చి చనిపోయిన కౌలు రైతులకు 15 రోజుల లోపలే 7 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తామన్నారు ఇంతవరకు ఎందుకు ఇవ్వలేక పోతున్నారు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నినించారు. YSRCP నాయకులకు, మీ ముఖ్యమంత్రికి దమ్ము, ధైర్యం ఉంటే మీ సొంత నిధులు ఇచ్చి కౌలు రైతు కుటుంబాలను ఆదుకోవచ్చు కదా? మేము అది కూడా అడగట్లేదు మీ సొంత డబ్బులు ఇవ్వడం లేదు? ప్రజల సొమ్మును కౌలు రైతులకు మీరు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా 7లక్షల రూపాయలు తక్షణమే ఇవ్వాలని జనసేనపార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడు చేయలేని గొప్ప కార్యక్రమం కౌలు రైతులకు తనవంతు సహాయంగా ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున పవన్ కళ్యాణ్ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రజలే కాక యావత్ దేశం హర్షిస్తోంది. ఇది చూచి ఓర్వలేక అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. CBI దత్తపుత్రుడిని చంచల్గూడ షటిల్ టీంని ఎదుర్కొనాలి అంటే కచ్చితంగా అన్ని YSRCP వ్యతిరేక పక్షాలు కలిసి పోటీ చేయవలసిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే మీరు తండ్రి పాలనని అడ్డం పెట్టుకొని, మీర అధికారంలోకి వచ్చి మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల సంపదని, వనరులని దోచుకుంటూ వేలకోట్ల దాచుకుని మదమెక్కి ఉన్నారు. ఆర్థిక నేరాలు చేసి, కోర్టుల చుట్టూ తిరుగుతూ మేము నీతిమంతులము అని నమ్మించే శక్తి సామర్థ్యాలు గల వ్యక్తులు మీరని అన్నారు. జనసేన పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటే నీకేంటి? ఎవరిని సీఎం చేస్తే మీకు ఏంటి! పవన్ కళ్యాణ్ గారు ఎవరితో సంసారం చేస్తే మీకు ఏమీ నొప్పి? మీరు బీజేపీతో చేస్తుంది సంసారమా? వ్యభిచారమా? ప్రజలకు తెలియజేయండి? మీరు ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు? మీరు అధికారంలో ఉన్నారు కదా చాతనైతే ప్రజలకు మేలు చేయండి. మీరు చెబుతున్న విధంగా మీది… రామరాజ్యము కాదు? రాక్షస రాజ్యం? ఈ నీచమైన పాలనను మీరేమన్నా రాజన్న రాజ్యం అంటారా? అని ఎద్దేవా చేశారు.