కదిరి, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై, చిన్నారులపై, దళితులపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, దాడులు జరుగుతూనే ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర మాత్రం వీడలేదు. రాష్ట్రానికి ఒక మహిళ హోమ్ మినిస్టర్ గా ఉండి కూడా మహిళపై జరుగుతున్న అత్యాచారాలను, దాడులను అరికట్టాల్సింది పోయి తల్లి తండ్రుల పెంపకంపై విమర్శలు చెయ్యడం బాధ కలిగించే అంశం. రాష్ట్రంలో జరుగుతున్న దాడులను చూస్తూ తమ ఆడబిడ్డలను ఉన్నతమైన చదువులకు పంపించాలన్నా, బయట ప్రాంతాలకు వెళ్లాలన్నా భయందోనలకు గురి అవుతున్నారు. మహిళలకు రక్షణ కల్పించలేని ఈ అసమర్థ ప్రభుత్వం ప్రచారాలకు మాత్రమే దిశా చట్టం అని ప్రగల్బాలు పలుకుతోంది తప్పా ఎక్కడా అమలుకు ఈ చట్టాలు అమలుకు నోచుకోలేదు. గన్ను వచ్చే లోపే జగన్ వస్తాడు అని చెప్పిన రోజమ్మ ఇప్పుడు నువ్వెక్కడ ఉన్నావని రాష్ట్రంలో ఉన్న మహిళలంతా నిలదీసే పరిస్థితి ఏర్పడింది. వీరికి పదవుల మీద ఉన్న వ్యామోహం రాష్ట్ర ప్రజలను, మహిళలను రక్షించడంలో లేదు. ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని సత్యసాయి జిల్లా గోరంట్లలో బీటెక్ చదువుతున్న విద్యార్థినిని అతికిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన దోషులను శిక్షించి ఆ కుటుంబ సభ్యులకు న్యాయం చెయ్యాలని కదిరి జనసేనపార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన తెలియజేయడం జరిగింది.