అరకు ( జనస్వరం ) : విప్లవ జ్యోతులు రగిలించి,బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడ లాడించిన స్వాతంత్ర్య సరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో అరకు నియోజకవర్గం నాయకులు సమన్వయ కమిటీ సభ్యులు మాదాల శ్రీరాములు, కొనెడి లక్ష్మణ్ రావు, బంగరు రామదాసు, శ్రీనివాస రెడ్డి, మండల నాయకులు సంతోష్ సింగ్, పొద్దు అర్జున్, డుంబ్రిగుడా మండల అధ్యక్షుడు కొనెడి చిన్నారవు నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాదాల శ్రీరాములు మాట్లాడుతూ మన్నెం యోధుడు తెలుగుజాతి ముద్దు బిడ్డ బ్రిటిష్ పాలకులను గడగడ లాడించి నెత్తురు మండే యువతకు అరాద్యుడన్నారు. మన్యం గుండె గుడిలో కొలువైన దేవుడు రవి అస్తమించని బ్రిటిష్ మహా సామ్రాజ్యాన్ని కూల గొట్టిన మహావీరుడు. బ్రిటీషర్ల గుండెల్లోకి దూసుకుపోయిన విప్లవ బాణం, మన్యం వీరుడు మాతృభూమి బానిస సంకెళ్లను తెంచేందుకు పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడని గుర్తు చేశారు. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి తరతరాలకు స్ఫూర్తిదాయకమని, ఈ మన్యం ప్రజల హృదయాల్లో ఎప్పటికి ఆ మహానీయుడికి ఒక చిరస్మరణీయ స్థానం ఉంటుందన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణత్యాగం చేసిన మహనీయుడుకి అల్లూరి సీతారామరాజు గారికి గిరిజన జాతి ఎప్పుడు రుణపడి ఉంటదన్నారు. ఈ నేల ఉద్యమాలకు పోరాటాలకు త్యాగాలకు మారుపేరని, అల్లూరి సీతారామరాజు మనకు స్ఫూర్తి ప్రదాత అని అన్నారు.