సత్తెనపల్లి, (జనస్వరం) : జలవనరుల శాఖ మంత్రి నియోజకవర్గ కేంద్రమైన సత్తెనపల్లిలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని రెండు ప్రధాన కూడళ్లలో ప్రజాప్రయోజనాల కోసం అన్నట్టు మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటుకు చలువపందిళ్లు వేసి, చుట్టూ స్థానిక మంత్రి, ఎంపీల ఫోటోలతో ఫ్లెక్సీలు దిట్టంగా కట్టి సుమారు వారం కావస్తున్నా వాటిలో ఇప్పటివరకు మంచినీరు ఉంచడం జరుగలేదు. ప్రజాధనం ఉపయోగించి వీరు చేస్తున్న హడావిడి కేవలం వారి ప్రచార ఆర్భాటం కోసమేనా లేక ప్రజాప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మిత్ర పక్షమైన బీజేపీతో కలసి సదరు చలివేంద్రాలు సందర్శించి, సత్వరమే సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టవలసినదిగా మీడియా ద్వారా సంబంధిత అధికారులకు సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధికార ప్రతినిధి తవిటి భవన్నారాయణ, సత్తెనపల్లి బీజేపీ అధ్యక్షుడు దివ్వెల శ్రీనివాసరావు, బిజెపి పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కట్టా శంకరరావు, జనసేన సత్తెనపల్లి మండలం అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, జనసేన నాయుకులు సిరిగిరి మణికంఠ, పట్టణ యువ మోర్చా అధ్యక్షులు చలువాది హరికుమార్, బీజేపీ సీనియర్ నాయకులు పగడాల సాంబశివరావు, పులిపాటి శ్రీరామమూర్తి, నోముల వెంకట చలపతిరావు, ఎద్దులదొడ్డి రమేష్, జనసైనికులు కుడుతూరి సిసింద్రీ, రామిసెట్టి సన్నీ తదితరులు పాల్గొన్నారు.