కదిరి, (జనస్వరం) : ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా మహిళలపై అత్యాచారాలు, హత్యలు, వేధింపులు తారా స్థాయికి చేరుకున్న మహిళా హోమ్ మినిస్టర్ గా ఉండి కూడా, ఆమె వాటిని ప్రోత్సహించేలాగా మాట్లాడే తీరు చాలా బాధాకరం. మహిళలపై జరుగుతున్న దాడులకు వారి తల్లిదండ్రులే కారణమని మహిళ హోమ్ మినిస్టర్ మాట్లాడం చాలా సిగ్గుచేటని, ఈ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామనీ జనసేనపార్టీ కదిరి నియోజకవర్గ ఇంచార్జ్ భైరవ ప్రసాద్ తెలియజేశారు. పోయిన వారంలో రేపల్లెలో జరిగిన సంఘటన, అలాగే విజయవాడలో మానసిక పరిపక్వత లేని ఒక మహిళపై అఘాయిత్యం, కొల్లూరు, తిరువూరులలో జరిగిన సంఘటనలు, నిన్నటి రోజున గోరంట్ల మండలంలో జరిగిన అత్యాచారం ఆపై హత్య దానిని ఆత్మహత్యగా చిత్రీకరించిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అలాగే మహిళా మంత్రులు కేవలం ముఖ్యమంత్రి భజన కాకుండా వారి శాఖలపై శ్రద్ధ చూపించి, ప్రజలకు న్యాయం చేయాలని కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నామని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి కూడా ప్రతిపక్షాలపై లేనిపోని ఆరోపణలు మానుకొని, మహిళలపై జరుగుతున్న దాడులను పార్టీల పరంగా కాకుండా ఏ పార్టీ వ్యకులైన నిష్పక్షపాతంగా వ్యవహరించి కఠినంగా శిక్షించాలని, మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా వాటిని నిరోధించాలని తెలియజేసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.