●శిరివెళ్ల రచ్చబండలో 130 మందికి రైతు భరోసా చెక్కులు పంపిణీ చేయనున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్
శిరివెళ్ల, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్ర పేరుతో నంద్యాల జిల్లాలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికారపార్టీ నాయకుల పీఠాలు కదులుతున్నాయని కర్నూలు జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ జనరల్ సెక్రెటరీ దాదిరెడ్డి మధుసూదన్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడువేల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే బాధిత కుటుంబ సభ్యులను సకాలంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం మొద్దునిద్ర అవలంభిస్తున్నదని కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ నెల 8న శిరివెళ్ల మండలంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి అదే సభలో నంద్యాల జిల్లా వ్యాప్తంగా 130 మంది ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబ సభ్యులకు లక్ష రూపాయల చెక్కును అందజేయనున్నట్లు మధుసూదన్ తెలిపారు. పవన్ కళ్యాణ్ వస్తున్నారన్న సమాచారాన్ని తెలుసుకొని శిరివెళ్ళ మండలంలో కేవలం ఇద్దరు రైతులకు మాత్రమే బ్యాంకు ఖాతాలో జమ చేశామని వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారన్నారు. ఇంతవరకు బాధితుల కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి పరామర్శించని అధికార పార్టీ ఎమ్మెల్యేలు తగుదునమ్మా అంటూ గత రెండు రోజుల నుండి బాధిత కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి పలకరిస్తూ ఉన్నారంటే అది కేవలం మా నాయకుడు పవన్ కళ్యాణ్ వస్తున్నారనీ, ఎక్కడ జనం జనసేన వైపు మల్లుతారోనని అధికార పార్టీ నేతలలో టెన్షన్ మొదలైనట్లు సూచించారు. ఇంతకాలం ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఆత్మహత్యలకు పాల్పడిన బాధిత కుటుంబ సభ్యులకు ఏడు లక్షలు పరిహారం ఇస్తానన్న హామీనీ సైతం నిలబెట్టుకోలేకపోయింది అన్నారు. అధిక ధరలను నియంత్రించకుండా మహిళలపై దాడులను అరికట్టకుండా రైతులకు మద్దతు ధర పెంచకుండా కాలయాపన చేసిన అధికార పార్టీకి జనసేన పార్టీ నుండి ప్రజల మద్దతుతో గుణపాఠం తప్పదని ఈ సందర్భంగా దాదిరెడ్డి మధుసూదన్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.