
చంద్రగిరి, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో చంద్రగిరి నియోజవర్గం దామలచెరువు పంచాయతీలో జిల్లా కార్యదర్శి నాజీర్ భాష, పాకాల మండలం అధ్యక్షులు తలారి గురునాథ్, వారి మిత్ర బృందం అధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ PAC సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలో ఉండి పదవులు అధికారం అనుభవిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు సామాన్య ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు. జనసేనపార్టీ అధికారంలో లేకపోయినా జనసేన పార్టీ నాయకులు సుమారు 90,000 రూపాయలు దామలచెరువు పంచాయతీలో గల మౌలాలి పేట వీధిలో నివసిస్తున్న ముస్లిం యువతి దిల్షాద్ తల్లి, తండ్రినీ కోల్పోయి గతంలో కురిసిన భారీ వర్షాలకు తనకు ఉన్న పూరి గుడిసె పూర్తిగా పడిపోవడం వల్ల ఒంటరిగా జీవనం సాగిస్తున్న మహిళలకు జనసేన పార్టీ సుమారు లక్ష పదివేల రూపాయలు ఆర్ధిక సహాయం చేయడం జరిగింది. జనసేనపార్టీ PAC సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా పసుపులేటి హరి ప్రసాద్ 20,000/- రూపాయలు ఆర్ధిక సహాయం చేశారు. తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు రాయల్ వెంకట్ నిర్మించబోయే ఇంటికి రంగులు ఇస్తానన్నారు. చంద్రగిరి మండల అధ్యక్షులు కిషోర్ రాయల్ కరెంటు వస్తువులు ఇచ్చారు. ఆర్థిక సహాయంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి ఇసుక, సిమెంట్, ఇనుము వంటివి ఇంకా కావాలి అంటే సహాయం చేస్తాము అని తెలిపారు. జనసేనపార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు ఆకర్షితులై ముస్లిం సోదరులు అలాగే ఇతర పార్టీల నాయకులు డా.హరి ప్రసాద్ గారి అధ్వర్యంలో జనసేన కండువాలు కప్పుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో GD నెల్లూరు నియోజకవర్గం ఇంఛార్జి డా.పొన్నా యుగంధర్, జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీమతి బీగాల అరుణ, జనసేన నాయకులు నాగుర్, వెంకటేష్, షాజహాన్, రహంతుల్లా, చాంద్ భాష, నౌమున్, మండల అధ్యక్షులు, కమిటీ సభ్యులు, జనసేన వీరమహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.