పామిడి, (జనస్వరం) : అనంతపురం జిల్లా, గుంతకల్లు నియోజకవర్గం, పామిడి మండలం జనసేన పార్టీ అధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్, RTC చార్జీలకు వ్యతిరేకంగా పామిడి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు M.ధనుంజయ అధ్యక్షతన నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ నిరసన ర్యాలీ కార్యక్రమంలో జిల్లా నాయకులు, అభిమానులు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన తమ నిరసన గళం వినిపించారు. ఈ నిరసన కార్యక్రమం పామిడి పట్టణం పంచముఖ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేయడం జరిగినది. అనంతరం జనసేన పార్టీ జిల్లా, మండల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకీ సామాన్య పేద ప్రజలపై నడ్డివిరిచే విధంగా చార్జీల బాదుడు పెరుగుతోందని ప్రభుత్వం మాత్రం వీటిపై సమీక్షలు చేయకుండా సాయం అందిస్తున్న పవన్ కళ్యాణ్ గారి పై వ్యక్తిగత దూషణలు చేస్తూ ప్రతిపక్షాలు నోరు నొక్కాలని చూస్తున్నాయి అని పవన్ కళ్యాణ్ మాత్రం పార్టీలను చూడకుండా కష్టంలో ఉన్న అన్ని పార్టీల వారికి భరోసా ఇస్తున్నారు. ఉదాహరణకు మొన్న పామిడి మండలంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారని ఆర్థిక సహాయం అందుకున్న వారిలో ఒకరు టిడిపి సానుభూతిపరులు ఇంకొకరు వైసిపి సానుభూతిపరులు ఉన్నరని అయినా గాని పవన్ కళ్యాణ్ గారు వారికున్న కష్టాన్ని చూశారు తప్ప పార్టీలను, వ్యక్తులను చూడలేదని కష్టం వస్తే ఎవరినైనా ఆదుకోవడానికి ముందుండే వ్యక్తీ పవన్ కళ్యాణ్ గారని తెలియజేశారు. అలాగే జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం పెంచిన ధరలను వ్యతిరేకిస్తూ పాదయాత్రలో బాదుడే బాదుడు అంటూ తనకు అవకాశం ఇస్తే పెరిగిన అన్ని ఛార్జీలను పూర్తిగా తగ్గి చేస్తానని నమ్మబలికి ప్రజలతో ఓట్లు వేయించుకొని ఇప్పుడు ప్రజలపై బాదుడే బాదుడు కాదు వీరబాదుడు రుచి చూపిస్తున్నాడు అని అన్నారు. ఇచ్చిన మాట తప్పను అనే జగన్ మోహన్ రెడ్డి మరి మాట తప్పి ప్రజలను మోసం చేశారని తెలియజేశారు. తన పాదయాత్రలో ప్రజలకు ముద్దులు పెడుతూ ఓట్లు అడిగి ఇప్పుడు అదే ప్రజలకు గుద్దులతో చార్జీల మోత మోగిస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారు అని ప్రభుత్వ వైఖరి మార్చకోకుంటే రానున్న రోజుల్లో మా నిరసన కార్యక్రమాలను ఇంకా తీవ్రతరం చేస్తామని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలను అర్థం చేసుకొని తను ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదంటే రానున్న రోజుల్లో ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారని, రాష్ట్రంలో మిమ్ములను తిరగనియారని, మీ ప్రజా వ్యతిరేక నిర్ణయాల వలన ప్రజలు నష్టపోతున్న తీరును క్షేత్రస్థాయిలో ఎండగడుతూ ప్రజలను చైతన్యపరిచి 2024లో జనసేన పార్టీ ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తామని ఘాటుగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ, సహాయ కార్యదర్శి జీవన్ కుమార్, జనసేన నాయకులు వేణు, రాజశేఖర్, జగదీష్, శరత్, సూర్య, ఖాజావలి, శేక్షావలి, రాము, మురళి, అబ్దుల్లా, నాగేంద్ర, సురేష్, సిద్ధ, ధనుంజయ, మాభూ, ప్రతాప్, ధన, సుకుమార్, జమీర్, అశోక్, విశ్వనాధ్, హరికృష్ణ, రాజేష్ కుమార్ జనసైనికులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.