అరకు, (జనస్వరం) : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గములో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం లక్ష్యంగా పని చేస్తానని, పార్టీ నన్ను నమ్మి, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులుగా బాధ్యత అప్పజెప్పిన సందర్భంగాను పార్టీకి మనస్ఫూర్తిగా విప్లవ అభినందనలు తెలియజేస్తున్నానని నూతనంగా ఎన్నికైన సాయిబాబా దురియా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024లో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేయాలనే లక్ష్యంతో జనసేన పార్టీ బలోపేతం లక్ష్యంతో, జనసేన పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలు క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్ళి పార్టీ నిర్మాణాలు మరింత బలాన్ని చేకూర్చే విధంగా ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. నియోజకవర్గంలోగల ఆరు మండలాల్లో ప్రతి పంచాయతీ గ్రామాలలో సమన్వయ కమిటీలు ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, సమస్యలను వెలికి తీస్తూ ఆయా సమస్యల పరిష్కారం కోసం అందరి సహకారంతో ఎనలేని పోరాటం చేసేందుకై, సమస్యలు పరిష్కారం అయినంత వరకు నిత్యం పోరాటాలు చేస్తూనే ఉంటామని తెలిపారు. జనసేన పార్టీ నియోజకవర్గ ప్రజలకు, గిరిజన రైతులకు, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు ఎల్లవేళల అండదండగా ఉంటాదని తెలిపారు. ఏదేమైనప్పటికీ పార్టీ బలోపేతం లక్ష్యంగా, ప్రజల సమస్య పరిష్కారం లక్ష్యంగా ముందుకు తీసుకెళ్లేందుకు అలానే పార్టీ విషయాలో ప్రతి జనసైనికులతో పంచుకుంటానని తెలిపారు. ముఖ్యంగా పార్టీ విధి విధానాలుకు కట్టుబడుతో ప్రతి ఒక్క జన సైనికులతో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గంలో బలమైన జనసేన ఆయుధంగా అందరూ తయారయ్యే దిశగా లక్ష్యంగా పని చేస్తానని తెలిపారు. భవిష్యత్తులో కూడా పార్టీ సూచించిన మేరకు పార్టీ విషయాల్లో కట్టుబడుతూ పార్టీలో ఏమి ఆశించకుండా అవసరమైతే ఒక జనసైనికుడుగా పనిచేయుటకు ఎప్పుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని నియోజకవర్గంలో సైన్యాన్ని తయారు చేయడం లక్ష్యంగా పని చేస్తానని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ పార్టీ నాపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించారు. కావున బాధ్యతను సమర్థవంతంగా నమ్మకంతోనే జనసేన నా ప్రపంచం అంటూ కష్టాలు వచ్చినా, నష్టం వచ్చినా పార్టీలో ఉండి నమ్మకంతో పని చేస్తానని తెలిపారు. పార్టీలో వ్యక్తిగత విమర్శలు వచ్చినప్పటికీ వాటిపై పట్టించుకోకుండా పార్టీ బలోపేతం లక్ష్యంగా పని చేస్తానని ఏమైనా అంతర్గత విభేదాలు మనకు మనకు వచ్చినప్పుడు సరిదిద్దుకుంటూ అవసరమైనప్పుడు పార్టీని సంప్రదించే దిశగా ముందడుగు వేస్తానని తెలిపారు.