● జన సైనికులే పార్టీకి పట్టుకొమ్మలు
● మండల నాయకత్వం బలోపేతం దిశగా అడుగులు
వెదురుకుప్పం, (జనస్వరం) : వెదురుకుప్పం మండల కేంద్రంలో మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న హాజరై, మాట్లాడుతూ జనసైనికులు నాయకులుగా చేయడమే లక్ష్యమని తెలియజేశారు. రాబోయే రోజుల్లో జన సైనికులే పార్టీకి పట్టుకొమ్మలని ఉద్ఘాటించారు. మండల నాయకత్వాన్ని బలోపేతం చేసి ప్రజల పక్షాన, ప్రజా క్షేమం కోసం పోరాటం చేసే దిశగా అడుగులు వేయాలని దిశానిర్దేశం చేశారు. రేపటి నుండి మూడు రోజులపాటు జరిగే జనసైనికుల కోసం జనసేన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చేయాల్సిన అవసరం వచ్చిందని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందని, నిత్యావసర సరుకులు మొదలుకొని, నిత్యం వాడే వస్తువులు వరకు ధరలు ఆకాశాన్ని అంటిoదని ఎద్దేవా చేశారు. జనసేన పార్టీ ప్రశ్నించే స్థాయి నుంచి ప్రస్తుతం అధికారం చేపట్టే స్థాయి ఎదిగిందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పురుషోత్తం, గౌరవ అధ్యక్షులు మధు, ప్రధాన కార్యదర్శి సతీష్, వెంకట ముని, సీనియర్ నాయకులు జగదీశ్వర్ రెడ్డి, జనసైనికులు ఉదయ్, అజయ్, హరీష్ పాల్గొన్నారు.