ఉరవకొండ, (జనస్వరం) : పేద, మధ్య తరగతి ప్రజల మీద ఆర్టీసీ, విద్యుత్ చార్జీల భారం మోపుతూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ” బాదుడే బాదుడు” అంటూ ఉరవకొండ జనసేనపార్టీ ఆధ్వర్యంలో టవర్ క్లాక్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి ఆ తర్వాత డిపో మేనేజర్ కు వినతి పత్రం అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ పేద, మద్య తరగతి రవాణా సాధనం ఆర్టీసీ బస్సు అని, ఇప్పుడు ఆర్టీసీ చార్జీలు పెరగటం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారు అని, ఆ రోజు ముఖ్యమంత్రి మాది ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుని ఈరోజు డీజల్ రేట్ పెరిగింది అని డీజల్ సెస్ పేరుతో ఆర్టీసి ఛార్జీలు పెంచడం న్యాయమా అని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజల కోసం డీజిల్ సబ్సిడీని ప్రభుత్వమే భరించి ఆర్టీసి చార్జీలు తగ్గించాలని లేని పక్షంలో ఉద్యమాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకెళతామని తెలియజేశారు. పాదయాత్రలో, ఓదార్పు యాత్రలో అలాగే ఎన్నికల హామీలను తుంగలో తొక్కి ఈరోజు ఆస్తి పన్ను, చెత్త పన్ను, అలాగే నవరత్నలకు కూడా రకరకాల నిబంధనలు పెట్టి తూట్లు పొడుస్తూ ఎగ్గొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఇదంతా మానుకోవాలని లేదంటే ప్రజావ్యతిరేకతను చవిచూడాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి అజయ్ కుమార్, ఉరవకొండ మండల అధ్యక్షులు చంద్ర శేఖర్, వజ్రకరూరు మండల అధ్యక్షుడు కేశవ జనాల, విడపనకల్లు మండలం అధ్యక్షుడు తలారి గోపాల్, కూడేరు మండల అధ్యక్షుడు నగేష్, గుడిసెల రాజేష్, అబ్దుల్లా, హరీష్ శంకర్ నాయక్, సూర్యనాయక్, రమేష్, దేవేంద్ర, భోగేష్, హుస్సేన్, మణికుమార్, విడపనకల్లు మండలం జనసైనికులు భద్ర, ప్రసాద్, రాజేష్, లోకేష్ సమర, ఎల్లప్ప, భీమ రాము, వజ్రకరూరు మండల జనసైనికులు సూర్యనారాయణ, రవి, జగదీశ్, జిలన్, రవి నాయక్, కుమార్ నాయక్, M రవి నాయక్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.