అరకు ( జనస్వరం ) : జనసేన పార్టీ మండల అధ్యక్షులు సిహెచ్ మురళి. మాట్లాడుతూ, బ్లాస్టింగ్ పర్మిషన్ లేకుండా నిమ్మలపాడు గ్రామంలో ఏపీఎండీసీ వారు ఎలా బ్లాస్టింగ్ చేయుచున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీసా చట్టం ప్రకారముగా 5వ షెడ్యూల్ ప్రాంతంలో గ్రామసభ నిర్వహించకుండా ఏపీఎండీసీ వారు ఏ విధంగా అనుమతి తీసుకుని ఉన్నారు. దొంగచాటున అనుమతి పొందినట్టు తెలుస్తుందన్నారు. ఇది గిరిజనులకు, గిరిజన చట్టాలకు తుంగలో తొక్కుతుంటే పీసా చట్టం అయినా బలమైన చట్టానికి కాపాడాల్సిన బాధ్యత ఎస్టీ కమిషన్ చైర్మన్, ఎమ్మెల్యే, ఎంపీలు ప్రజల పక్షాన ఉన్నట్టా లేనట్టా లేదా బినామీల పక్షం ఉన్నట్టా అని ప్రశ్నించారు. అసలు గిరిజన ప్రాంతంలో మైనింగ్ గ్రామ సభ తీర్మానం తప్పనిసరి. అది కూడా అఖిలపక్ష రాజకీయ ప్రజా సంఘాల మధ్య అందరి సమక్షంలో పంచాయతీ సెక్రెటరీ మరియు మండల ఎంపిడిఓ వారు అధికారికంగా నోటీసులు ఇచ్చి పిలిపించి గ్రామ సభ నిర్వహించాలని అన్నారు. ఎస్టీ కమిషన్ అరకు పర్యటనలో మైనింగ్ మీద ఫిర్యాదు చేసినప్పటికీ కనీసం ఎందుకు స్పందించలేదు. అసలు st కమిషన్ ఎవరి గురించి ప్రజల కోసమా మైనింగ్ మాఫియా కోసం పీసా చట్టం ప్రకారం 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఏపీఎండీసీ ఒక ప్రైవేటు సంస్థే గిరిజన చట్టాలను కాపాడాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. దీనిపై జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో అనంతగిరి మండల జనసేన నాయకులు గుజ్జల మంగళ కొర్రా ప్రవీణ్, గేమేల సన్యాసి రావు, కొర్రా రమేష్, దండుసేన నవీన్ కుమార్, వీరమహిళలు రత్న ప్రియా, వాణి పాల్గొన్నారు.