గుంటూరు, (జనస్వరం) : గుంటూరు జిల్లా, అమరావతి మండలం లింగాపురం గ్రామంలో నిన్న రాత్రి వైసిపి నాయకులు పోలీసుల సహాయంతో జనసేన ఫ్లెక్సీలు తొలగిస్తుంటే జనసైనికులు అడ్డుకోవడం జరిగింది. ఈ క్రమంలో అధికార పార్టీ వాళ్లు పోలీసుల సహాయంతో బెదిరించి ఫ్లెక్సీలను జనసేన పార్టీవి మాత్రమే తొలగించే ప్రయత్నం చేయగా జనసేన పార్టీ కార్యకర్త పెరుమాళ్ళ వీరాంజనేయులు మా పార్టీ ఫ్లెక్సీలను తొలగిస్తున్న సందర్భంలో తీవ్ర మనస్తాపానికి చెంది తన ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. పక్కనే ఉన్న జనసైనికులు అతన్ని అమరావతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ విషయం తెలుసుకుని గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అమరావతి ప్రభుత్వ హాస్పటల్లో ఉన్న జన సైనికుడు పెరుమాళ్ళ వీరాంజనేయులుని హాస్పటల్ లో కలిసి వారి యోగ క్షేమాలను తెలుసుకోవడం జరిగింది. అలాగే ప్రభుత్వ డాక్టర్ని కలిసి వీరికి మెరుగైన వైద్యం అందించాల్సిగా కోరడం జరిగింది. తర్వాత లింగాపురం గ్రామానికి సందర్శించి అక్కడ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి నిన్నటి సంగతిని వివరంగా తెలుసుకోవడం జరిగింది. తర్వాత లింగాపురం సచివాలయం సెక్రటరీతో మాట్లాడి మీరు అధికార పార్టీకి కొమ్ము కాయకుండా న్యాయపరంగా అందరికీ సముచిత న్యాయం చేయవలసిందిగా కోరడం జరిగింది. ఇదే విషయం మరల రిపీట్ జరిగితే మేము రోడ్లెక్కి నిరసన తెలియ జేసి అధికారులను నిలదిస్తామని హెచ్చరించారు. అలాగే లింగపురం గ్రామానికి అండగా ఉంటాము అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అడపా మాణిక్యాలరావు, రామకృష్ణ, వాకా అఖిల్, శిఖా బాలు, మదులాల్, బిల్లూరి సురేష్, రాయి సత్యనారాయన, గోవింద్ గోపీచంద్, పెరుమాళ్ళ ఎరుకలయ్య, పసుపులేటి రాంబాబు, సన్నల గోపాలకృష్ణ, హరి, ప్రసాద్, పెదకూరపాడు మండల అధ్యక్షులు మల్లెల చలపతిరావు, నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.