
నెల్లూరు, (జనస్వరం) : నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ పరిధిలోని కోవూరు మండలం గుమ్మళ్ళదిబ్బ గ్రామంలో 50 ఏళ్ల నుంచి పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి వరకు 420 మంది విద్యార్థులు ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ఇప్పుడు అధికారులు ఈ పాఠశాలను మూసివేస్తాము అని విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు వ్యతిరేకిస్తూ మా పాఠశాల మాకు కావాలి అని నిరసనకు దిగారు. విద్యార్థి తల్లిదండ్రులకు మద్దతుగా జనసేనపార్టీ తరుపున పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా జనసేనపార్టీ ఉపాధ్యక్షులు బద్ధిపూడి సుధీర్, కోవూరు మండల అధ్యక్షులు షేక్ అల్తాఫ్, కోవూరు నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు చప్పిడి శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు జిల్లా IT వింగ్ కోఆర్డినేటర్ నక్కల శివకృష్ణ, కోవూరు నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.