శ్రీకాళహస్తి, (జనస్వరం) : శ్రీకాళహస్తి నియోజకవర్గములో రేణిగుంట ఆర్టీసీ బస్టాండ్ నందు అక్రమంగా నిర్మిస్తున్న షాపులను తొలగించాలని నిన్న తిరుపతి కలెక్టర్ కి జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇంఛార్జ్ వినుత కోటా, నాయకులు కలిసి అక్రమ కట్టడాలు తొలగించాలని ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయినా కానీ అక్కడ నిర్మాణం కొనసాగుతున్నందున జనసేన పార్టీ అఖిలపక్ష పార్టీలతో కలిసి శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే పోలీసులు అక్రమంగా రక్తం వచ్చేటట్లు దాడి చేసి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. పోలీస్ స్టేషన్లో డీఎస్పీ దురుసుగా పరుష పదజాలంతో జనసేన నాయకులను మాట్లాడటం జరిగింది. దానిపై డీఎస్పీ మాపై రక్తం వచ్చేటట్లు కొట్టినందుకు మరియు పరుష పదజాలంతో దూషించినందుకు రేణిగుంట పోలీస్ స్టేషన్ నందు డిఎస్పీపై ఫిర్యాదు చేయటానికి జనసేన నాయకులు వెళ్లగా పోలీసులు నిరాకరించారు. చివరికి తిరుపతి ఎస్పీతో వినుతా ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదును వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది. ఎస్పి దానికి స్పందిస్తూ రేపు ఎస్ పి ఆఫీసు నందు వచ్చి కలవమని, దురుసుగా ప్రవర్తించిన డీఎస్పీ పైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన ముగించుకొని వెళ్లడం జరిగింది.