కర్నూలు ( జనస్వరం ) : వైసిపి ప్రభుత్వం నూతన ఆంక్షలను అమ్మఒడి పధకంలో ఎందుకు పెట్టిందని డబ్బులు ఇవ్వడానికా లేక అమ్మఒడి పధకం పక్కన పెట్టి మంగళం పాడేందుకా అని జనసేనపార్టీ నియోజకవర్గ మీడియా ఇంచార్జి గానిగ బాషా తెలిపారు. ఈ సందర్భంగా గానిగ బాషా మాట్లాడుతూ అమ్మఒడి లబ్ధిదారులకు చాలామందికి ప్రభుత్వం పెట్టిన ఆంక్షలు తెలియవని తెలిసినవారు కాళ్ళు అరిగేలా తిరుగుతున్న ఏదో ఒక నిబంధనలతో ప్రభుత్వ కార్యాలయాల దగ్గరకు వెళ్లి నిరాశతో వెనుతిరుగుతున్నారని అన్నారు. ఆధార్ కార్డ్ అప్డేట్ కోసం సచివాలయాలకు కుటుంబ వివరాలు తెలుసుకోవుటకు వాలంటీర్ల దగ్గరకు వెళ్లి పరిశీలించుకొని చివరిగా యన్. పి. సి. ఐ కొరకు బ్యాంకులకు వెళితే కె వై సి లేదని బ్యాంకులో చెయ్యరని బయట సి యస్ పి కు వెళ్లమని చెబుతున్నారు. తల్లులకు తలనొప్పిగా మారిన ఇన్ని ఆంక్షల్లో ఏదో ఒకటి లేక పోయినా అమ్మఒడి రాదని చెప్పడం చివరకు 300 యూనిట్లకు మించి విద్యుత్ వాడకం జరిగిన అమ్మఒడి కట్ చేస్తామని ప్రకటించడాన్ని గమనిస్తే గత సంవత్సరం ఇవ్వాల్సిన అమ్మఒడి ఇవ్వకుండా ప్రస్తుత సంవత్సరం జులైలో ఇస్తామని చెప్పి చివరకు ఇన్ని ఆంక్షలు విధించి రాబోయే రోజుల్లో అమ్మఒడి డబ్బులు ఎవరికి ఇవ్వకుండా పథకాన్ని దూరం చేసే పనిలో ఉన్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.