మాడుగుల ( జనస్వరం ) : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత డా|| బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా చీడికాడ లో వున్న. డా “B. R. అంబేద్కర్ గారి విగ్రహనికి పూలమాల వేసి అనంతరం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం లో ఆ మహాత్మునికి నివాళులు అర్పించడం జరిగింది. ఆ మహాత్ముడు మన మధ్య లేకపోయినా బడుగు బలహీన వర్గాలు బాగు కోసం ఆయన రాజ్యాంగాన్ని రూపొందించారు. అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు ప్రజలకు అన్ని రకాలుగా ఇబ్బందులు కలిగిస్తున్నా మనల్ని మనం కాపాడుకోవడానికి ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాగా అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగమే మనకు రక్షణగా ఈ రోజుల్లో ఉంటుంది. ఏమైనా అంటే ఈ ప్రభుత్వాలు అన్ని వర్గాలకి ప్రాధాన్యం ఇస్తున్నాం పదవుల్లో పెద్దపీట వేశాం అంటారు గానీ పేరుకే పదవులు ఇస్తారు అవి కూడా అలంకార ప్రాయంగానే ఉంటాయి. పదవులు వాళ్ళకి ఇస్తారు. పవర్ మీ చేతుల్లో ఉంటుంది . పదవులు ఇవ్వడమే కాదు వారికి బాధ్యతల్లో కూడా స్వేచ్ఛనివ్వాలి. ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో అంబేద్కర్ గారు గానీ ఉండి ఉంటే ఆయన ఎంతో బాధపడేవారు ఆయన ఏ ఆశయంతో అయితే రాజ్యాంగాన్ని రూపొందించారో ప్రస్తుతం ఆ విధంగా జరగడం లేదు. బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగాలన్నా అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేరాలన్నా అంబేద్కర్ గారి ఆశయాలకు వారసుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే సాధ్యం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల్లో జనసైనికులు పాల్గొన్నారు.