కొత్తపల్లి గ్రామంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ సంబరాలు
49 వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పేరు మీద కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు జనసైనికులు. గ్రామంలోని దశాంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి కొత్తపల్లి గ్రామంలోని పేద ప్రజల ఆకలి తీర్చి ఉన్నత మనస్సుని చాటారు.సేవాకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్న కొత్తపల్లి జనసైనికులు, జనసేనాని జన్మదినం సందర్బంగా 50 మందికి ఆహార పొట్లాలు పంపిణీ చేసారు. పవన్ కల్యాణ్ గారి ఆశయాలతో జన్మదిన వేడుకల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొత్తపల్లి గుడి ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగింది. జనసేనాని అడుగు జాడల్లో నడుస్తూ జనసేన బలోపేతమే లక్ష్యంగా ప్రజల కోసం తాము వున్నాం అని మరోసారి నిరూపించారు కొత్తపల్లి జనసైనికులు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.