లక్కవరపుకోట జనసేనపార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

   లక్కవరపుకోట, (జనస్వరం) : మన భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన వేడుకలను శృంగవరపుకోట నియోజకవర్గము, లక్కవరపుకోట మండలంలో జనసేన నాయకులు వబ్బిన సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బహుజన సమజ్వాజ్ పార్టీ ఈశ్వరరావు, సెర్చ్ కమిటీ సభ్యులు రామెల్ల శివాజీ  మాట్లాడుతూ అంబేద్కర్ లాంటి మహనీయుల భావజాలం, ఆశయాలను ప్రతీ పౌరుడు మార్గదర్శకంగా తీసుకుని నవసమాజ, సమసమాజ నిర్మాణానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వబ్బిన సత్యనారాయణ కోట సెంటర్లో గల విగ్రహానికి ఇనుప నిచ్చెన నిర్మిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే నియోజకవర్గ నాయకులు పెడిరెడ్ల రాజశేఖర్ కూడా sc. కాలనీలో గల అంబేద్కర్ విగ్రహం కార్యక్రమంలో విగ్రహానికి ఇనుప నిచ్చెన బహుకరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు సూరి దేముడు, అప్పారావు, గానివడ అప్పారావు,  జనసేన నాయకులు జొన్నపల్లి సత్తిబాబు, రాంబాబు, మధు, చంటి నక్కరాజు సతీష్, గాలి అప్పారావు, వీరమహిళ వెంకట లక్ష్మి పాల్గొన్నారు.

See also  ప్రమాదావశాత్తూ మరణించిన జనసైనికుడు కిరణ్ కుమార్ కుటుంబానికి ఆర్థిక సహాకారం అందించిన జనసేన నాయకులు బొడ్డేపల్లి రఘు