పాలకొండ, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం పనసనందివాడ గ్రామ ప్రజలు, జనసైనికులు ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. జెండా ఆవిష్కరణ అనంతరం సభ వేదికపై ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని ప్రజా ధనాన్ని దోచుకుని ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని, అధికారంలో రాకముందు హామీల వర్షం కురిపించిన జగన్ రెడ్డి ప్రజలపై పన్నుల భారం అత్యధికంగా విధిస్తూ నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకే విధంగా చేస్తున్నారని మండిపడ్డారు. 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇస్తానని ఈరోజు అమాంతంగా రేట్లు పెంచి ప్రజల నెత్తిపై భారం మోపుతున్నారని కరెంట్ కోతలతో ప్రజలకు నరకాన్ని చూపిస్తున్నారని ఈ వైసిపి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేయడం జరిగింది.
ఈ సందర్భంగా పంట నష్టం వచ్చి చనిపోయిన కౌలు రైతులకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు లక్ష రూపాయల చొప్పున ఇవ్వడానికి జనసేన పార్టీ తరపున ఐదు కోట్లు ప్రకటించారని తెలియచేయడం జరిగింది. జనసైనికులు ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని జనసైనికులు వాళ్ల ఆలోచనలకు అనుగుణంగా పని చేయాలని హితవు పలికారు. అలాగే గ్రామ స్థాయిలో బలమైన మార్పు తీసుకొస్తామని 2024 లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేయాలని ఈ సందర్భంగా తెలియచేశారు.ఈ కార్యక్రమంలో జనసైనికులు, వీర మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.