మదనపల్లి, (జనస్వరం) : రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పాలన మొదలు పెట్టాక రాష్ట్రంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజలు పలు రకాలైన ఇబ్బందులు పడుతున్నారు. నాడు భవన నిర్మాణ కార్మికుల నుండి నేటి కౌలు రైతు వరకు ప్రతి ఒక్కరు స్వయంగా బాధితులు అయ్యారు. ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి టార్గెట్ చేస్తూ మాట్లాడటాన్ని జనసేన తరపున తీవ్రంగా ఖండిస్తున్నమని చిత్తూరు జిల్లా జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సామాన్యుడు కూడా కనీసం 200 యూనిట్లు కరెంటు వాడతాడు అని చెప్పినా సీఎం ఇప్పుడు 30 యూనిట్లకే కరెంటు వినియోగ రేట్లు పెంచేశారని ఎద్దేవా చేశారు. 2004లో జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఉన్న ఆస్తులను, ప్రస్తుతం ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎంత అని చూస్తే అర్థమవుతోంది. దోపిడీ ఏ విధంగా జరుగుతోంది అనేది తెలుస్తోంది. గతములో 16 నెలలు జైల్లో ఉండి 11 కేసులను ప్రతీ వారం కోర్టుకు వెళ్లి వస్తున్న వ్యక్తి, ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను దొంగలు అనడం విడ్డురంగా ఉందని తెలిపారు. అలాగే పెంచిన కరెంటు చార్జీల రేటు తగ్గించి, ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా చూడాల్సిన ప్రభుత్వం జనసేన పార్టీ అధ్యక్షుడిని టార్గెట్ చేయడం దారుణమని మండిపడ్డారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన ధోరణి మార్చుకోకపోతే 2024 లో ప్రజలు సరైన బుద్ది చెపుతారని దారం అనిత తెలిపారు.