●అనధికార విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు
● మొబైల్ ఫోన్ వెలుతురులో ప్రసవాలు రాష్ట్రంలో దుస్థితిని తెలియజేస్తున్నాయి
● పవర్ హాలిడే ప్రకటనలతో పారిశ్రామిక అభివృద్ధి విఘాతం
● జనసేన ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న
గంగాధర నెల్లూరు, (జనస్వరం) : వైసిపి ప్రభుత్వ లోపభూయిష్ట నిర్ణయాలు, అనలోచిత విధానాలే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కారణమని జనసేన పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న స్పష్టం చేశారు. గ్రామాలలో 11 నుంచి14 గంటలు, పట్టణాలలో 5 నుంచి 8 గంటలు, నగరాలలో 4 నుంచి 6 గంటలు చొప్పున అనధికార విద్యుత్ కోతలు విధించడంతో జనం అల్లాడిపోతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొబైల్ ఫోన్ల లైట్ల వెలుగులో ఆసుపత్రల్లో ఆపరేషన్లు, ప్రసవాలు జరగడం చూస్తుంటే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుందని తెలిపారు. శనివారం పెనుమూరులోని మండల కేంద్రంలో విద్యుత్ సంక్షోభంపై మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక యూనిట్ 2 రూపాయలకే గ్రీన్ ఎనర్జీ ని తీసుకొస్తామని చెప్పి, ఇప్పుడేమో కోల్డ్ ఎనర్జీని 20 రూపాయలు పెట్టి కొంటుంది. ఇలాంటి లోపభూయిష్ట నిర్ణయాల వల్లే ఈ సంక్షోభం ఏర్పడిందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని, అల్పాదాయ వర్గాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన వైసీపీ నాయకత్వం ఇవాళ 57 శాతం చార్జీలు పెంచిందని దుయ్య భట్టారు. ఫ్యాను, రెండు లైట్లు, 15 గంటలు టీవీ చూసినా 150 యూనిట్లు ఖర్చు అవుతుందని మరో 50 యూనిట్లు పెద్దమనసుతో అదనంగా ఇస్తున్నామని చెప్పి ఇప్పుడు విద్యుత్ చార్జీలు భారీగా పెంచి ఇళ్లలో ఫ్యాన్ వేసుకోకుండా చేశారని ఎద్దేవా చేశారు. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం అవుతున్న వారు కరెంటు కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పగలంతా తరగతి గదుల్లో ఉండి రాత్రులు ప్రశాంత నిద్రలేక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. పరిశ్రమలకు ఇప్పటికీ వారాంతంలో ఒక రోజంతా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. తాజాగా మరో రోజు పవర్ హాలిడే ప్రకటించడంతో పరిశ్రమలు వారానికి రెండు రోజులు మూతపడుతున్నాయని తెలిపారు. అలాగే నిరంతరం పని చేసే పరిశ్రమలు ఇప్పుడు వాడుతున్న కరెంటు ఇక 50 శాతం మాత్రమే వాడాలని నిబంధన విధించారని తెలిపారు. దీనితో కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టిన పారిశ్రామిక వేత్తలు విద్యుత్ కోతలతో నష్టాల పాలవుతున్నారు అని తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధికి విఘాతం కలుగుతుందని తెలిపారు. 36 లక్షల మంది కార్మికుల ఉపాధిపై ప్రభావం పడే ప్రమాదం ఉందని తెలియజేశారు. వ్యక్తిగత అజెండాతో జనసేన పార్టీని స్థాపించలేదు ప్రజలు బాగుండాలి, వారిని పల్లకి ఎక్కించాలని ఉద్దేశంతోనే పార్టీని రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రారంభించారని తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల నుండి పెరిగిన విద్యుత్ చార్జీల వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు. ఉద్యోగులు, కౌలు రైతులు ఆత్మహత్యకు జనసేన కారణం కాదు మీ విధానాలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ప్రభుత్వ విధానాలు పాలసీల గురించి సమస్యల గురించి మాట్లాడితే వ్యక్తిగతంగా దూషిస్తున్నారు, మీరు వ్యక్తిగతంగా దూషణలకు దిగితే వాటిని ఎలా ఎదుర్కోవాలో మాకు బాగా తెలుసు అని ఎద్దేవా చేశారు. నోటికి వచ్చినట్లు మాట్లాడి మా సహనాన్ని పరీక్షించవద్దు అని హితవు పలికారు. పవర్ పర్చేజ్ అగ్రిమెంటు నుంచి పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించే వరకు వైసిపి అనాలోచిత విధానాలతో ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించి వచ్చే ఎన్నికల్లో జనసేన జెండా ఎగరేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీనివాసులు, మండల ప్రధాన కార్యదర్శి బాలాజీ, మండల యూత్ ప్రెసిడెంట్ గురు ప్రసాద్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, కార్వేటినగరం మండలం బూత్ కన్వీనర్ అన్నామలై, సంయుక్త కార్యదర్శి నవీన్ జనసైనికులు పాల్గొన్నారు.