అమరావతి, (జనస్వరం) : నేను ఇచ్చే లక్ష రూపాయలు రైతుల కుటుంబాలకు ఏదో చేస్తుందని ఇవ్వడం లేదు. కనీసం వారి కోసం మనం ఉన్నాం, వారి కన్నీరు తుడుస్తాం అనే నమ్మకం ఇవ్వడానికే ప్రకటించాను.
కౌలు రైతులలో అన్ని కులాల వారు ఉన్నారు. ఒక్క కులం వారు కాదు. అన్నం పెట్టే రైతులకు కులం ఉండదు. కానీ ysrcp పార్టీ రైతులకు కూడా కులాన్ని అంటగట్టింది.
కౌలు రైతులు అంటే ఎవరూ అనే విషయం కూడా తెలియడం లేదు. వారిని పట్టించుకోకుండా వారి ఆత్మహత్యలకు కారణం అయింది ysrcp పార్టీ ప్రభుత్వం
బాదుడే బాదుడు అని ఆరోజు వైసీపీ నాయకులే చెప్పారు కదా. పాపం ప్రజల సమస్యలపై వేదన ఉంది అనుకుంటే, అధికారంలోకి వచ్చి చెత్త పన్ను, కరెంట్ బిల్లు ఇలా ప్రతీ విషయంలో రెట్లు పెంచుకుంటూ పోయింది ysrcp పార్టీ ప్రభుత్వం.
వైసీపీ నాయకులు చెప్పే మాయమాటలు నమ్మడానికి ఇది పాత తరం కాదు, కొత్తతరం, మీరు చేసే ప్రతీ తప్పుడు పనిని గమనిస్తున్నారు.
మద్యపాన నిషేదం చేస్తామని అధికారంలోకి వచ్చి, ఇప్పుడు నాణ్యత లేని మద్యాన్ని ప్రత్యేక రేట్లకు అమ్ముతూ, రెట్లు పెంచడం వలన మద్యం తాగేవారు తగ్గుతారు అని ysrcp పార్టీనాయకులు తప్పుడు లాజిక్ చెప్తున్నారు.
జనసైనికులపై ysrcp పార్టీ నాయకులకు అంత ప్రేమ అక్కర్లేదు. మీకు అంత ప్రేమ ఉంటే మొన్న మా సభకు వచ్చిన జనాలను తరువాతి రోజు పోలీసులను ఇళ్లకు పంపించి ఎందుకు బెదిరించారు.
వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చనివ్వను అని నేను ఎంతో ఆలోచించి అన్నాను. ysrcp పార్టీ నాయకులు రాష్ట్రాన్ని వల్ల పాలసీల ద్వారా శ్రీలంక లా మార్చేస్తుంటే వారి నుండి రాష్ట్రాన్ని రక్షించడానికి ఆ మాట అన్నాను.
ఎంతోమంది మహానుభావులు త్యాగాలు చేస్తేనే స్వాతంత్య్రం వచ్చింది. అలాంటి వారిని గుర్తుచేసుకోవాలి. వారి స్ఫూర్తిని తీసుకుంటూ ముందుకు వెళుతున్నాం. ఓట్లు పడతాయో లేదో తరవాత సంగతి.