పాడేరు, (జనస్వరం) : పాడేరు మేజర్ పంచాయతీ కొత్త పాడేరు గ్రామంలో కనీస మంచి నీరు సదుపాయం లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు గురి అవ్వుతున్నారు. గత ప్రభుత్వములో ఉన్న టీడీపీ గవర్నమెంట్ హయాంలో అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామస్తులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయిన గ్రామస్తులకు న్యాయం జరగలేదు. అందుకని గ్రామస్తులు పాడేరు జనసేన పార్టీని ఆశ్రయించారు. జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు గ్రామాన్ని సందర్శించి బాధితులకు అండగా ఉంటాం అని భరోసా ఇవ్వడం జరిగింది. అధికార పార్టీ నాయకులు ఓట్లు అడిగేటప్పుడు అవసరం అయిన పేద ప్రజలు సమస్య వచ్చినప్పుడు ఎందుకని స్పందించడం లేదు అని జనసేన పార్టీ ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. ఎన్నో సార్లు వాళ్ళ యొక్క సమస్య వివరించడం జరిగింది. అలాగే పాడేరు మేజర్ పంచాయతీలో చాలా చోట్ల మంచి నీటి సమస్యలు చాలానే ఉన్నాయి. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం. మీరు నవరత్నాలు అని పేరుతో ప్రజల్ని మోసం చేసింది చాలు మధ్య తరగతి కుటుంబం, పేదరికం కుటుంబం మీద మీరు మోపిన కరెంట్ బిల్లులు పెంచడం ప్రజలు తీవ్ర అగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. కొత్త పాడేరు గ్రామంలో మంచి నీటి సదుపాయం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది ప్రభుత్వ తీరు మార్చుకోకపోతే ఎండాకాలంలో ప్రజలు తీవ్రఇబ్బందులకు గురికాక తప్పదు. అందుకని జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఛలో ITDA కార్యాలయంకి ఖాళీ బిందేలతో నిరసన కార్యక్రమం చేయడం, గ్రామస్తుల ఆవేదన పాడేరు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో బాధితులకు అండగా ఉంటామని గ్రామస్తులకి జనసేన పార్టీని పార్టీ ద్వారా భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పాడేరు మండల అధ్యక్షులు నందోలి. మురళి కృష్ణ, జనసేన పార్టీ వీరమహిళ అధికార ప్రతినిధి బొనుకుల.దివ్యలత, అరకు పార్లమెంట్ ఎక్ససిక్యూటివ్ కమిటీ మెంబెర్ కొర్ర.కమల్ హాసన్, కాకినాడరూరల్ క్రియ శీలక సభ్యుడు. సీ హెచ్. అనిల్ కుమార్, రాజు, పవన్, మణికంఠ, శంకర్, బాలకృష్ణ, జనసేన పార్టీ వార్డు నాయకురాలు పి. చిన్నతల్లి, గ్రామస్తులు సంపవతి, సన్యాసమ్మ, సరస్వతి, పి.లక్ష్మీ,కె.వర, పి. పురిని, కె. పద్మ, పి. విజయకుమారి, డి. మంగ తదితరులు పాల్గొన్నారు.