అనంతపురం ( జనస్వరం ) : ఓ.డి చెరువులో పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని ఎంఆర్‌ఓ గారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మండల అధ్యక్షులు మేకల ఈశ్వర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ క్షణాన ఏ పన్ను వేస్తుందో ఏ చార్జీలు పెంచుతుందో తెలియక పేద మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోయే పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తాయన్నారు. యువకుడు జగన్ రెడ్డి చక్కటి పరిపాలన అందిస్తారని రాష్ట్ర ప్రజలు భావించారు. జగన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సామాన్య ప్రజలకు 200 యూనిట్ వరకు ఉచితంగా కరెంటు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయి జనసేన పార్టీ నుంచి ప్రశ్నిస్తున్నామని అన్నారు. మాట తప్పం మడమ తిప్పం అంటే ఇదేనా జగన్ రెడ్డి గారు, ఇవాళ ఫ్యాన్ ఆన్ చేయాలంటే సామాన్య మధ్యతరగతి ప్రజలకు భయమేస్తుంది. ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను జనసేన పార్టీ తరుపున తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని లేదంటే ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం ఇలాంటి విచిత్రమైన పరిపాలన ప్రజలను ఇబ్బంది పెట్టే పరిపాలన రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమాలు వెంటనే వైసీపీ ప్రభుత్వం మానుకోవాలని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ పెంచిన విద్యుత్ ఛార్జీల తగ్గించే వరకు జనసేన పార్టీ పోరాటం చేస్తోందని ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కొండబోయన సతీష్, ధనుంజయ, కేశవ నాయక్, శంకర్, ఉపేంద్ర, సద్దాం హుస్సేన్, పవన్ చంద్ర, ఇర్ఫాన్, భార్గవ్, మహేష్, జోష్ణ, వినోద్, పాల్గొన్నారు.