పాలకొండ నియోజకవర్గంలో జనసేనాని జన్మదిన వేడుకలు షురూ
జనసేనఅధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ గర్భాన సత్తిబాబు గారి ఆధ్వర్యలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, పోలీస్ శాఖ, వైద్యాధికారులకు, మున్సిపల్ కమిషనర్ వారికి కరోనా లో ప్రజలను అప్రమత్తం చేయడంలో వీరు చేసిన సేవలకు గాను జనసేనాని పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా శాలువాలతో, పూల బొకేలుతో చిరు సత్కారాలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఈ సందర్భంగా నియోజకవర్గ జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు గారు అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా టమోటా పల్లి గ్రామంలో ఉన్న అనాధాశ్రమంలో జనసేనాని పుట్టినరోజు కేకును స్థానిక పిల్లలతో కట్ చేయించి వారితో కాసేపు మాట్లాడి పిల్లలకు మిఠాయిలు పంపిణీ చేశారు. అలాగే వీర గొట్టం టౌన్ లో రక్త శిబిరాన్ని పాలకొండ నియోజకవర్గం జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు గారి ఆధ్వర్యంలో ఈ ఒక్క శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన ప్రతి సంవత్సరం వివిధ సేవా కార్యక్రమాల్లో భాగంగా రక్త శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన సైనికులు, గొర్ల మన్మధ , హరికృష్ణ శివప్రసాద్, రమేష్, చిన్న, కిరణ్, వెంకటరమణ, మహేష్ ,యేసు, జానీ, యుగేంద్ర, స్థానిక యువత, పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.