విశాఖపట్నం జిల్లా ( జనస్వరం ) : పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. శివ శంకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యుత్ చార్జీల పెంపు నిరసనగా జనసేన పార్టీ నేతృత్వంలో జిల్లా పరిషత్తు నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీగా జనసైనికులు ర్యాలీ చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ, ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి వారంతా నినాదాలు చేశారు. దీంతో పెద్ద ఎత్తున పోలీనులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను అడ్డుకున్నారు. వినతిపత్రం అందజేయడానికి పోలీనులు జనసేన నాయకులను, కార్పొరేటర్ లను మాత్రమే కలెక్టర్ కార్యాలయం లోపలికి అనుమతించారు. జిల్లాకలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో డి ఆర్ ఓ మూర్తికి వారు వినతివత్రం అందజేశారు. ఇప్పటికే కోవిడ్ వలన పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయని, ఈ తరుణంలో విద్యుత్ చార్జీలు పెంచడం సరికాదని జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య చెప్పారు. కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ వైనీపీ ప్రభుత్వం ఆరు సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని, పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించకపోతే భారీ ఉద్యమం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సత్య, కోన తాతారావు, విజయ్ కుమార్, వసుపులేటి ఉషాకిరణ్, డాక్టర్ బొడ్డేపల్లి రఘు, కార్పొరేటర్లు దల్లీ గోవిందరెడ్డి, ఖీశెట్టి వసంతలక్ష్మి అధిక సంఖ్యలో జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.