నెల్లూరు ( జనస్వరం ) : కష్టకాలంలో ప్రజలను ఇబ్బంది పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విద్యుత్ చార్జీలు పెంచడం దుర్మార్గం అంటూ జనసేన పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి అనంతరం కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించారు. జిల్లా ఉపాధ్యక్షుడు గునుకుల కిషోర్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే విద్యుత్ బిల్లులను తగ్గిస్తామంటూ, నిరుపేదలకు, ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామంటూ హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడా హామీలను నిలబెట్టుకోకపోవడమే కాకుండా విపరీతంగా విద్యుత్ ఛార్జీలను పెంచడాన్ని జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన నాయకులు అన్నారు. ఈ సందర్భంగా వివిధ నియోజక వర్గాల నాయకులు మాట్లాడుతూ కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలియచేసారు. జనసేన అద్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందించాలని ఇచ్చిన పిలుపు మేరకు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నెల్లూరు జిల్లా జనసేన నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో పెరిగిన విద్యుత్ ఛార్జీల అంశంలో “బాదుడే…. బాదుడు” అంటూ వ్యాఖ్యానించిన అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి తీరుని ఏ రకమైన బాదుడుతో పోల్చుకోవాలో కూడా తెలియట్లేదని వారు అన్నారు. ఏడాది క్రితం విద్యుత్ ధరల స్లాబుల్లో మతలబులు సృష్టించి, ట్రూ అప్ ఛార్జీల పేరుతో బాదిన బాదుడుని ప్రజలు మరిచిపోకముందే ఇప్పుడు మరోసారి విద్యుత్ ఛార్జీల పెంపు బాదుడుకు ఈ ప్రభుత్వం సిద్ధమవడం గర్హ నీయమని అభిప్రాయ పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఛార్జీల పెంపుతో 1400 కోట్లు, ట్రూ అప్ ఛార్జీల పేరుతో సుమారు 3000 కోట్ల రూపాయల భారం ప్రజలపై పడుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మన నెల్లూరు జిల్లాలో ప్రజలపై సుమారు 300 కోట్ల రూపాయల పైగానే భారం పడనుందని, ఇప్పటికే చెత్త పన్ను, ఆస్తి పన్ను, పెట్రోల్ పై వ్యాట్ బాదుడు, అధిక మధ్యం ధరలతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రజలను విద్యుత్ ఛార్జీల పెంపుతో మరింతగా దోచుకునేందుకు ఈ ప్రభుత్వం సిద్ధమైందని, దీన్ని ఓ హేయమైన చర్యగా భావిస్తున్నామని, విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోకుంటే జనసేన పార్టీ తరపున, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తీవ్ర స్థాయి ఉద్యమాన్ని చేపడతామని వారు తెలియచేసారు. 2024 లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే రాష్ట్రం కష్టాల నుండి గట్టెక్కుతుందని వారు తెలియచేసారు. ఈ కార్యక్రమంలోజిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,జిల్లా అధికార ప్రతినిదులు దుగ్గిశెట్టి సుజయ్,కలువాయి సుధీర్,రాష్ట్ర కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు సుధీర్ బాధిపూడి, కోలా విజయలక్మి,జిల్లా నాయకులు వెంకట సుబ్బయ్య,గూడూరు వెంకటేశ్వర్లు, గుడి హరి రెడ్డి సుకన్య, కృష్ణవేణి, జనసేన ఆత్మకూరు ఇంచార్జి శ్రీధర్, సూళ్లూరు పేట ఇంచార్జి ప్రవీణ్, సర్వేపల్లి నాయకులు సురేష్ నాయుడు, నెల్లూరు నగర నాయకులు కాకు మురళి రెడ్డి, పి.చంద్ర శేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ నాయకులు శ్రీపతి రాము, కావాలి నాయకులు సుబ్బారావు,మహిళా నాయకులు ఇందిరా రెడ్డి, ఆలియా, శిరీషా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.