● 30 యూనిట్లుకే 45 పైసలు భారమా? 400 యూనిట్ల పైన కేవలం 55 పైసలేనా?
● 100 యూనిట్ల నుండి 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు దాదాపు యూనిట్ కి అదనంగా 2 రూపాయల వరకు భారమా?
● అధిక విద్యుత్ వినియోగదార్లులకు ఊరట కల్గిస్తూ, పేదలు మధ్య తరగతి వారిపైనే అధిక భారమా?
● ప్రజాసంక్షేమ ప్రభుత్వం అంటే పేద, మధ్య తరగతి ప్రజలపై భారం మోపడమా?
అనంతపురం, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఒకటి చేసేది మరొకటి. తన ప్రమాణ స్వీకారం సభ సాక్షిగా గత ప్రభుత్వం పెంచిన కరెంటు చార్జీలను పూర్తిగా తగ్గిస్తాం అని గొంతు చించుకొని హామీ ఇచ్చి ప్రజలందరికి చెవులో పువ్వు పెట్టారు. కనీస నెల వారి చార్జీలను, కేటగిరిలను రద్దు చేసి కొత్తగా 6 స్లాబులుగా విభజించి, సామాన్య వినియోగదారులపై భారం మోపడమే కాకుండా కేవలం 30 యూనిట్ల దాటితే 45 పైసలు చొప్పున కరెంటు చార్జీలు బాదడం ఎంతో దుర్మార్గమైన చర్య అని, అప్పుడు ఇచ్చిన హామీని ఇప్పుడు ఎందుకు తుంగలోతొక్కరని, ఎవరు అయితే ఫ్యాన్ ని చూసి ఓటు వేసారో వారు కనీసం ఇంట్లో ఫ్యాన్ వేసుకోవడానికి కూడా భయపడే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని, మరోపక్క అనధికార కరెంట్ కోతలతో ప్రజలు ఎంతో యిబ్బందులు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం 3 ఏళ్ళ పాలనలో 7 సార్లు విధ్యుత్ చార్జీలు పెంచి 12 వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారం మోపడమే కాకుండా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పు 24 వేల కొట్లతో విద్యుత్ ఉద్యోగుల భద్రత కోసం ఏమి చర్యలు చేపట్టారని ప్రశ్నిస్తున్నాము. అన్ని నిత్యావసరాలపై ధరలు, పన్నులు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తూ సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్ గా మార్చివేశారు. కరెంటు చార్జీల పెంపుతో మూలుగుతున్న నక్కపై తాటి పండు పడినట్టుంది ఆంధ్ర ప్రజల పరిస్థితి. ప్రజాసంక్షేమ ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ లీడర్లకు కరెంటు బిల్లులను పెంచడం సబబుగా ఉందా? గత టీడీపీ పార్టీ చేసిన తప్పులనే ప్రస్తుత వైసీపీ కూడా చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. మీకు ప్రజా సంక్షేమమే ముఖ్యమైతే 100 యూనిట్లపై నుండి స్లాబులుగా విభజించి ధరల్లో స్వల్ప మార్పులను చేసుకోవాలని, 30 యూనిట్ల నుండే స్లాబుల్లో దరల మార్పును చేయడం ఎంతవరకు సమంజసం అని జనసేన పార్టీ తరుపున ప్రశ్నిస్తున్నాము. ఇప్పటికైనా పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని లేదంటే జనసేన పార్టీ జిల్లా నాయకత్వంతో కలసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికైనా సిద్ధం అని జనసేన నాయకులు తుపాకుల భాస్కర్, మండల కన్వీనర్ గంజికుంట రామకృష్ణ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.