కదిరి, (జనస్వరం) : పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నేడు కలెక్టరేట్ కార్యాలయం నందు నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జి భైరవ ప్రసాద్, మండల కన్వీనర్ లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం కరువుతో సతమతమవుతూ మృత్యువుతో పోరాటం చేస్తున్న పేద ప్రజలపై కరెంటు ఛార్జీలు మరింత పెంచి వారి బ్రతుకుల్లో కరెంటుతో కాటు వేయడం తగదన్నారు. విద్యుత్ చార్జీల పెంపు వలన సంవత్సరానికి దాదాపు 14 వందల కోట్ల భారం పడనుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రజల పట్ల ఉన్నటువంటి సవతి తల్లి ప్రేమ కనబరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో అప్పటి ముఖ్యంత్రి చంద్రబాబుపై కరెంట్ భాదుడే భాదుడు అంటూ ఆరోపణలు చేసి నేడు 13 స్లాబ్ ల నుండి 6 స్లాబ్ కుదించి నేడు యూనిట్ కు 45పైసల నుండి రూ 1.57 పెంచి పేద వాడి బ్రతుకులను కరెంట్ తగిలిన కాకిలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. పాలకులు ఎప్పుడు పడితే అప్పుడు ధరలను పెంచి పేద ప్రజలను రోడ్డు పాలు చేయడం హేయమైన చర్యన్నారు. ఇప్పుడు చెత్తపై పన్ను అంటూ వచ్చే ఆగష్టు నెలలో ట్రూ ఆఫ్ చార్జీల భారం మోపనున్నారని పన్నులు ఛార్జీలు పెంచుతూ పోతే భవిష్యత్తులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఖండిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కదిరి రూరల్ మండల కన్వీనర్ చిల్ల మహేష్, నాయకులు చలపతి, రవీంద్ర నాయక్, మేకల చేర్వు చౌదరి, చెక్క రమణ, అంజి బాబు, హరి నాయక్, రమణ నాయక్, శేఖర్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.