విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ 9వ వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి అద్దేపల్లి సౌజన్యకౌన్సిల్ మీటింగ్ నందు మున్సిపాలిటీలో ఉన్న అన్ని సమస్యలు పై నిలదీయడం జరిగింది. చెత్త పన్నులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ చెత్తని శుభ్రం చేయడంలో లేదని వాపోయారు. ఎన్ని సార్లు చెప్పిన సమస్యలుపై స్పందించని అధికార యంత్రాంగం ఇప్పటికి అయిన స్పందించి త్వరగా సమస్యలు పరిస్కారం చేయాలని తెలిపారు. తదనంతరం మున్సిపల్ కమిషనర్ ని కలిసి కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య గారు, టౌన్ ప్రెసిడెంట్ అద్దేపల్లి గణేష్ గారు కౌన్సిల్ మీటింగ్ లో పెట్టిన ఎజెండా మరియు వాటి అకౌంట్స్ లో జరుగుతున్న అవకతవకలు పై నిలదీశారు. మాకు పూర్తి వివరాలతో తెలియపర్చాలి అని ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. దీనిపై తొందరలో వివరణ ఇవ్వాలని కోరడం జరిగింది.