ఆలూరు ( జనస్వరం ) : కర్నూలు జిల్లా, ఆలూరు మండలం, హులేబీడు గ్రామంలో ఉన్న RCM పాఠశాలకి వెళ్లి అక్కడి పరిస్థితి గురించి ఆలూరు జనసేన మండల నాయకులు రంజిత్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గంలో చాలా ప్రాథమిక పాఠశాలలో పరిమితికి మించిన విద్యార్థులు ఉన్నారు. వారందరికి గాను ఒక ఉపాధ్యాయుడితో బోధన జరుగుతుంది. అలా బోధన చేయలేక చాలామంది ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. మీరు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయుల నియామకం జరగాలి. ఉపాధ్యాయుల కొరత తీర్చి విద్యార్థులకు అండగా ఉండాలి. మంచి విద్య విద్యార్థులకు అందినప్పుడు వైసీపీ ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు వ్యవస్థ పరిపూర్ణం అవుతుంది. లేకపోతే బిల్డింగ్ లకు మంచి రంగులు వేసుకోవడానికి మాత్రమే పనికొస్తుంది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఛత్రపతి, మున్నీర్, యశోద్, మున్నా, రాజ్ కుమార్, హనుమంతు పాల్గొన్నారు.