అవనిగడ్డ ( జనస్వరం ) : సరిహద్దుల్లో మద్యం, గంజాయి అక్రమ రవాణా అడ్డుకునేందుకు విధులు నిర్వహిస్తున్న ఎస్పీవోలను తొలగిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేయటం చాలా బాధాకరమని అవనిగడ్డ జనసేనపార్టీ నాయకులు రాయపూడి వేణుగోపాల్ రావు ఖండించారు. ఏప్రిల్ 1 నుంచి ఎస్పీవోలను తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రభుత్వ మద్యం షాపులు నుండి సాయంత్రంకు బార్ లకు, గ్రామాలకు చేరిపోతున్నది. బెల్ట్ షాపులు లేవు అన్న పేరేగాని అంతకన్నా ఎక్కువుగా అక్రమ మద్యం వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతుందన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో షాపులు ద్వారా అమ్మే దానికన్నా బయట గ్రామాలలో ఎక్కువ ధరలకు అమ్మకాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో spo లను రద్దు చెయ్యటం వలన గ్రామాలలో అక్రమ మద్యం ఏరులు అయ్యి పారుతుంది. నిరుపేద కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి కనపడుతుంది. రాష్ట్ర సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొటక్షన్ ఆఫీసర్స్ను (SPO) తొలగిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చెయ్యటంలో ప్రభుత్వం పునరాలోచన చెయ్యాలి. అయితే గత కొన్ని నెలలుగా తమకు వేతనం ఇవ్వటంలేదని సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వీరిని తొలగించటం చర్చనీయాంశంగా మారింది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో పునరాలోచన చెయ్యాలిని జనసేన పార్టీ తరుపున ప్రభుత్వంను అధికారులను కోరుచున్నామన్నారు.