
గుడివాడ ( జనస్వరం ) : గుడివాడ కంకిపాడు రోడ్డు గుంతలమయం కావడంతో ఆర్టీసీ బస్సు వాహనదారుడిని ఢీ కొనడంతో ఇద్దరు వాహనదారులు మృతి చెందడం జరిగింది. స్థానిక జనసేన నాయకులు జనసేన నాయకులు గుడివాడ రామకృష్ణ (RK) మాట్లాడుతూ గతంలో ఎన్నోసార్లు ఆ రోడ్డుకు మరమ్మత్తులు చేయాలని అధికారులకు జనసేనపార్టీ ద్వారా విన్నవించుకున్నాం. అయినా ఫలితం లేకుండా పోయింది. నియోజకవర్గం నుండి మంత్రి స్థాయి నాయకుడు ఉన్నా ఫలితం లేదు. ఎన్నోసార్లు అధికారులను, నాయకులను హెచ్చరించినా పట్టించుకోవట్లేదు. ఈ రహదారి గూండా నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. అయినా వారిలో చలనం కనిపించట్లేదు. ఆ రోడ్డును మరమ్మతులు చేయాలని మోకాలు మీద నిరసన చేస్తూ సంతకాలు సేకరించి R&B అధికారులకు, మరియు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి వినతి పత్రం అందజేసామని అన్నారు. ప్రభుత్వం తొందరగా చర్యలు తీసుకొని రహదారికి మరమ్మత్తులు వేయకపోతే జనసేన పార్టీ తరుపున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.