Search
Close this search box.
Search
Close this search box.

రిపోర్టర్స్ కావలెను – జనస్వరం న్యూస్

రిపోర్టర్స్

                  తెలుగు పత్రికా రంగంలో మాదైన శైలిలో సామాన్య ప్రజలకు, ప్రభుత్వానికి, నాయకులకి మధ్య సమాచార వారధిగా, ప్రజా సమస్యల పరిష్కార దిశగా, పాఠకుల దిక్సూచిగా “ జనస్వరం న్యూస్ ” పాఠకుల మన్నలను పొందుతున్నది. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న వార్తా సమాచారాన్ని సామాన్యులకు సైతం మా ప్రచార సాధనాలు అయిన వెబ్సైట్, ఈ – వార్తాపత్రిక, ఆండ్రాయిడ్ ఆప్, డైలీహంట్, యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా అందిస్తూ విశ్వాసాన్ని చూరగొన్నాము. మరింత నాణ్యమైన వార్తా సమాచారాన్ని, వార్తా ప్రపంచాన్ని విస్తరించడానికి ప్రజలకు అందించాలనే సంకల్పంతో నియోజకవర్గాల వారీగా వాలంటీర్స్ రిపోర్టర్స్ ను నియమించుకోవాలని భావిస్తున్నాము. 

      –   రిపోర్టర్ గా మీరు మాకు వాలంటీర్ గా చేస్తున్నట్టుగా భావించాలి. ఇందుకు జీతం అంటూ ఏమి ఉండదు. మీరు స్థానికంగా అందించే యాడ్స్ ద్వారా మీకు అందులో వాటా ఇవ్వబడుతుంది. మీకు ఐడి కార్డ్ అందించబడుతుంది. రోజులో ఒక అర్ధ గంట సమయం కేటాయించి న్యూస్ పంపుతారు. 

అర్హతలు :
– తెలుగు భాష మీద అవగాహన, రాయడం, చదవడం స్పష్టంగా తెలిసి ఉండాలి.
– రాజకీయాలు, ప్రస్తుత సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలి.
– నిత్యం వార్తా సమాచారాన్ని తెలుసుకోగలగాలి, వాటి మీద విశ్లేషణ చేయగలిగే కనీస పరిజ్ఞానం ఉండాలి.
– మీ నియోజకవర్గం గురించి క్షుణ్ణంగా, మీ ప్రాంత సమస్యలపై అవగాహన కలిగి ఉండాలి.
– మీ నియోజకవర్గంలోని నాయకులతో పరిచయం ఉండి, వారు చేసే కార్యక్రమాల గూర్చి మాకు వేగంగా అందించగలగాలి.
– మీ ప్రాంతంలో జరిగే కార్యక్రమాలను ఒక వార్తా రూపంలో, ఫోటోలతో పంపించే అవగాహన ఉండాలి.
– సామాజిక మాధ్యమాలపై పట్టు ఉండాలి.

షరతులు :
– జనస్వరం న్యూస్ కోసం వార్తా సమాచారాన్ని వేగంగా అందించగలగాలి.
– మొదటి 30 రోజులు మీరు అందించే వార్తా సమాచారాన్ని బట్టి మీకు ప్రెస్ ఐడి కార్డ్స్ అందజేయబడును.
– జనసేన పార్టీ మీటింగులు జరిగినపుడు మాకు సహకరించి, అందుకు తగ్గట్టుగా న్యూస్ అందివ్వగలగాలి.
– మేము అందించే ప్రెస్ ఐడి కార్డ్స్ ఇతర కార్యకలపాలకు వాడితే చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
– జనస్వరం న్యూస్ నియమ నిబంధనలనుసరించి ప్రెస్ ఐడి కార్డ్స్ ఇవ్వబడుతాయి.

ప్రయోజనాలు :
– ప్రెస్ ఐడి కార్డు అందించబడును.
– విలేకరి పనితీరుని బట్టి టీ షర్ట్, మైక్ ఇతర ఉపకరణాలను అందించబడును.
– ఏవైనా మీ ప్రాంత యాడ్స్ అందిస్తే అందులో కొంత శాతం మీకు రుసుము చెల్లించబడును.
– ఎలాంటి ఒత్తిడి, శ్రమ, టార్గెట్స్ ఉండవు.
– భవిష్యత్తులో మేము చేపట్టబోయే కార్యక్రమాల్లో ప్రాధాన్యత.

          ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ కింద ఫారం పూర్తి చేయండి. అలాగే మా వాట్సప్ గ్రూపులో మీరు జాయిన్ అయ్యి, తరచుగా మీ ఏరియాలో జరుగుతున్నటువంటి న్యూస్ ఈ గ్రూపులో పంపండి. 30 రోజుల పాటు మీరు అందించే న్యూస్ ను బట్టి, మీ వ్యవహార శైలి, ఉత్సాహాన్ని బట్టి రిపోర్టర్స్ గా అవకాశం కల్పిస్తాము. ఆ తరువాత మీకు ప్రెస్ ఐడి కార్డ్స్, టి- షర్ట్స్, మైకు, ఇతర ఉపకరణాలు అందిస్తాము.  

ఈ ఫారం పూర్తి చేయండి : Click Here 

మా వాట్సప్ గ్రూపులో జాయిన్ అవ్వండి : Invite Link Here 

* షరతులు వర్తిస్తాయి. 

 

3 Responses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way