పెనుగంచిప్రోలులో పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా వృద్ధులకు అన్నదానం చేసిన జనసైనికులు
పెనుగంచిప్రోలు గ్రామంలోని పవన్ కళ్యాణ్ అభిమానులు మాగల్లు వృద్ధ ఆశ్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా వారు వృద్ధ ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం మరియు పండ్లు , బ్రెడ్ ప్యాకెట్స్ పంపిణీ చేసి వృద్ధులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ అభిమానులు మాట్లాడుతూ జన్మదిన వేడుకలు సందర్భంగా అన్నదానం చేసిన అభిమానులు ఇంత మంచి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా ఉందని వారు తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో నడుస్తున్నామని, ఆయన జన్మదిన సందర్భంగా ఇలా వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వట్టెం తిరుపతిరావు, వట్టెం గోపి, వట్టెం సాయి, బూర రవితేజ, నరిశెట్టి గోపి, బుచ్చిబాబు సందీప్ మరియు తదితరులు పాల్గొన్నారు.