
రాజంపేట ( జనస్వరం ) : వైసీపీ వారు గుడిని గుడిలో వున్న లింగాన్ని మింగుతుంటే ఈ టీడీపీ వారు దేవాలయాల పక్కన భూములు ఆక్రమించి పార్టీ ఆఫీసు కొరకు శంఖుస్థాపన చేస్తున్నారు. ఈ రెండు పార్టీ లు కూడ దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలకు న్యాయం చేసేదేమి లేదని రాజంపేట జనసేన నాయకులు అన్నారు. సిద్ధవటంలో శ్రీకృష్ణదేవరాయల హయాంలో శ్రీ రంగనాధ స్వామి వుంది. అక్కడ చుట్టు పక్కల ఖాళీ స్థలం వుంటే అక్కడ దైవ భజనలకు పార్కింగ్ కు ఉపయోగించేవారు. కానీ ఇపుడు టీడీపీ వారు 50 సెంట్లు ఆక్రమించి సర్వే నంబరు 404, 405 పేరు మీద అనుసందాన పత్రము పుట్టించి 20సెంట్లలలో టీడీపీ ఆఫీసు కడుతున్నారు. పక్కనే విద్యార్థుల హాస్టల్ కూడ వుంది. గుడి, పాఠశాలలకు 100 మీటర్ల దూరం వరకు రాజకీయ పార్టీ ఆఫీసు పెట్టకూడదు అనే జ్ఞానం లేకుండా పార్టీ ఆఫీసు ఏర్పాటు చేయడం ఎంతవరకు న్యాయం అని మండల MRO గారికి సిధ్ధవటం మండల జనసేన నాయకులు కొట్టే వెంకట రాజేష్ ఆధ్యర్యంలో వినతిపత్రం అందించి టీడీపీ వారిపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. మీరు త్వరగా పరష్కరించకపోతే గ్రామ ప్రజల కోసం పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు చేస్తామని జనసేన నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులతో పాటు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.