
లక్కవరం, (జనస్వరం) : తూర్పు గోదావరి జిల్లా రామరాజు లంక గ్రామనికి చెందిన మెడిచర్ల హనుమ గారికి రెండో పాపా పుట్టిన సందర్భంగా అలాగే తన అభిమాన నటుడు మెగా ఫ్యామిలీ వారసుడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా లక్కవరం గ్రామంలో ఉన్న మేరీ వృద్ధాశ్రమంలో 1500 రూపాయల విలువగల కూరగాయలు, నిత్యావసర వస్తువుల ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొడలడా జనసైనికులు పంచదార చినబాబు, ఆరవ శ్రీనివాసరావు, పిండి నారాయణరావు పాల్గొన్నారు.