
శింగనమల, (జనస్వరం) : జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు టి సి వరుణ్ గారి ఆదేశాల మేరకు సింగనమల నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో సింగనమల నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో గత ఖరీఫ్ కాలంలో పడిన అకాల వర్షాల మూలంగా నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం వరి పంటకు మాత్రమే చెల్లించారు. మిగతా వేరుశనగ పప్పు, శనగ పంటలకు నష్టపరిహారం చెల్లించాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కలెక్టర్ స్పందించి పప్పు శనగ, వేరుశనగ, కంది పంట రైతులకు నష్ట పరిహారం ఏప్రిల్, మే నెలలో పరిహారం అందేలా చేస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి పురుషోత్తంరెడ్డి, డీ జయమ్మ, సింగనమల మండల కన్వీనర్ తోట ఓబులేషు, సాయి శంకర్, మధు, జులా కాల్వ శేషు, ధన తదితరులు పాల్గొన్నారు.