పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ నుండి జనసేనాని ఎందుకు అయ్యాడు!
అసెంబ్లీలో అడుగు పెట్టి ఉంటే ఏం జరిగి ఉండేది ???
73 సంవత్సరాలు గల స్వాతంత్య్ర భారతదేశంలో ఇప్పటికి కనీస మౌలిక సదుపాయాలు అయినటువంటి నీరు అందని పల్లెలెన్నో, రోడ్డు మార్గం లేని తండాలెన్నో, విద్యుత్తు సదుపాయం లేని ఉర్లెన్నో, ప్రాథమిక పాఠశాలలు లేని మారుమూల గ్రామాలెన్నో, వైద్య సాదుపాయం లేని వాడలెన్నో? దేశ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు ఎంతమంది అర్హత గల వ్యక్తులకు నేరుగా అందుతున్నాయి? ఇవన్నీ సాటి మనిషికి అర్థం అయినా, ఇప్పటికి కలలాగే ఉండే ఎన్నో ప్రశ్నలు. వీటికి సమాధానం ఎక్కడ ఉంది? ఇవి ఎప్పుడు నెరవేరుతాయి? నాకు తెలిసిన రాజకీయ నాయకుడు లేక అధికారి వలన నాకు ప్రభుత్వంతో అవసరం అయ్యే పనులే కాక కొన్ని సొంత పనులు కూడా నెరవేరుతాయి అని అనుకునే కార్యకర్తకు(పౌరునికి) నా విన్నపం :
ఒక రాజకీయ నాయకుడు 5 లక్ష రూపాయలు పెట్టి ఒక ఉరికి రోడ్డు వేపించాలని, ప్రభుత్వం నుండి డబ్బు విడుదల చేయిస్తే.. ఆ డబ్బును మీకు మరియు మీలాంటి మరికొంతమంది కార్యకర్తలకు మనిషికి 5 వేలు లేక 10 వేలు ఇచ్చి మిగిలిన డబ్బులను తాను తీసుకోవడం వలన, అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? ఆ ఉరికి రోడ్డు ఎక్కడ వస్తుంది? పరోక్షంగా ఆ ఊరికి రోడ్డు రాకపోవడంలో మీరు కూడా భాగస్వాములే కదా? ఆ తప్పులో మీకు భాగముంది కదా? ఆ ఊరి ప్రజలను మోసం చేయడంలో మీరు కూడా దోషులే కదా?నాకు తెలిసిన నాయకుడు లేక అధికారి ఎటువంటి వారు అయినా కావచ్చు, నాకు మరియు నా కుటుంబానికి సంబధించినంతవరకు ప్రభుత్వంతో గల అన్ని పనులు జరగడమే కాదు, మాకు కూడా కొన్ని ప్రయోజనాలు అందుతున్నయి అనే మీకు…? సమాజంలో గల సాటి మనిషి, మీలాంటి మనిషే అనే భావన మరియు మీలాగే వాళ్లకు ప్రభుత్వం సహకరించాలని, ప్రభుత్వం ద్వారా అందవలసిన సంక్షేమ పథకాలు వాళ్లకు అందాలని కోరుకోవడంలో తప్పులేదు కదా? పరోక్షంగా అర్హులైన ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అందకపోవడంలో, మీరు కూడా దోషులే కదా? వాళ్లకు అందాల్సిన ప్రతిఫలాలు మీరే పంచేసుకుంటే, వాళ్ళ పొట్టకూడుకొట్టినట్లే కదా? మీ నాయకుడు తప్పు చేస్తే అది తప్పు అని మీరు చెప్పాలి కదా?
పదవులంటే, ప్రజలను బానిసలుగా చేసుకొని పాలించడమే అని భావించే రోజుల్లో, ఎన్నికలకు ముందు ఓటుకు 2000 రూపాయలు, ఆడవాళ్లకు ఒక చీర, మగవాళ్లకు ఒక బ్రాందీ సీసా మరియు పిల్లలకు ఒక క్రికెట్ కిట్ ను ఇచ్చి వాళ్ళను ఏమార్చి, తమ మాటలతో వాగ్దానాలతో మభ్యపెట్టి ఓట్లు దండుకునే కాలంలో, అధికారం కోసం వేరే వారి కుటుంబాల మీద కూడా మానసికంగా దాడి చేసే సమయంలో, అడిగిన పదవులు ఇవ్వలేదని రాజీనామా చేసి వేరే పార్టీలలోకి వెళ్లి తిరిగి అతన్నే విమర్శించే(తిట్టే) రోజుల్లో, రాజకీయ పదవులకోసం మీడియా, పత్రిక రంగాన్ని తమ అదుపులో పెట్టుకొని తుచ్ఛమైన పనులన్నీ చేసే పరిస్థితుల నుండి విసిగి వేసారి ఒక వ్యక్తి వచ్చాడు. రాజకీయం అంటే ఇది కాదు అని చెప్పి, భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా ఉండేలా చూపించడానికి వచ్చాడు. కులాలు మతాలు ప్రాంతాలంటూ అంత వేరు చేసి విభజించి పాలించి ప్రజలందరినీ వేరు వేరుగా చేసి వాళ్ళ రాజకీయ సౌలభ్యం కోసం ప్రజలను మభ్యపెట్టే ఇలాంటి పరిస్థితి మారాలని ఒకడు వచ్చాడు.
ఇలాంటి దీర్ఘకాల పరిస్థితుల్లో నుండే కడుపుమండి, సమాజంలో జరిగే ఇలాంటి అవినీతి అక్రమ రాజకీయ దౌర్జన్యాలు పైరవీలు నుండి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కాపాడాలని.. వాళ్లకు సేవ చేయాలనీ తన వృత్తినే వదిలేసి, కోట్లు గడించే సినిమాను సైతం వద్దనుకుని త్యజించి, ఎంతోమంది ఆయనున్న స్థానం కోసం ప్రాకులాడుతుంటే, అలంటి స్థానాన్ని తృణప్రాయంగా వదిలేసి… సమాజంలో జరిగే తప్పును ప్రశ్నించే అర్హత ఉండి కూడా ప్రశ్నిచకుండా, పోరాడకపోవడం తప్పు చేసినట్లే అని భావించి “సమర్థులు నాకెందుకులే అని ఇంట్లో కూర్చుంటే, అసమర్థులే రాజ్యాలు ఏలతారు” అనే నినాదాన్ని నమ్మి, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనుకోని కొంతలో కొంత అయినా మార్పు తీసుకురావాలని రాజకీయాల్లోకి ప్రవేశించిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
సంపాదన, అధికారమే పరమావధిగా సాగుతున్న నేటి రాజకీయాల్లో, కనుమరుగౌతున్న నీతి నిజాయితీతో కూడిన రాజకీయాలను అందించాలనే ఉద్దేశంతో అణగారిన ఎన్నో వేల గొంతుకుల ప్రశ్న అయి ప్రశ్నించారు శ్రీ పవన కళ్యాణ్ గారు. చిన్నతనం నుండే సామజిక స్పృహ కలిగిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ప్రత్యక్షంగా పాల్గొన్న 2019 ఎన్నికల సందర్భంగా తిరిగిన ప్రతి ప్రాంతం నుండి, ప్రతి నియోజకవర్గం నుండి ఎన్నో సమస్యలను వెలికితీశారు. పాలక ప్రతి పక్షాలను నిలదీశారు. ప్రజా సమస్యలను బయటికి తీసి, కవాతులు ద్వారా ప్రభుత్వాలకు నిరసన తెలిపారు. తన జనసేన పోరాటయాత్రల ద్వారా అణగారిన బడుగు బలహీన వర్గాలకు నేనున్నానే ధైర్యం అందిస్తూనే అవినీతి అక్రమాలపై ధ్వజమెత్తారు. రాజకీయాల్లో ప్రత్యర్థులే ఉంటారు కానీ శత్రువులు ఉండరని చాలాసార్లు చెప్పారు. తన గురించి ఎవరైనా తప్పుడు వార్తలు రాసిన, తప్పుడు సమాచారం చెప్పిన ఎప్పుడు వాటికి స్పందించలేదు, బాధపడలేదు. తన మీద ఎన్ని విధాలుగా మానసిక దాడులు చేసిన మౌనముగా సహించి, ధైర్యంగా ఎదురుకున్నాడే కానీ ఒకనాడు కూడా ఏ వ్యక్తిని కానీ, కుటుంబాన్ని దూషించిన దాఖలాలు లేవు. తనను ఎన్ని విధాలుగా పక్కదారి పట్టించాలని చుసిన, తన ధ్యేయం ప్రజల సంక్షేమం కొరకే నని నిరంతరం ప్రజల కొరకై పోరాడాడు. ప్రజా సంక్షేమమే తన అంతిమ లక్ష్యం అని పలుమార్లు వక్కాణించి చెప్పారు. విద్యార్థులు, వైద్యులు, లాయర్లు, ఉద్యోగస్తులు, టీచర్లు, ఆటో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యాన రైతులు, పారిశుధ్య కార్మికులు…. ఇలా ప్రతి వృత్తి ప్రజలతో సభలను నిర్వహించి, వాళ్ళను ప్రత్యక్షంగా కలిసి, వాళ్ళ సమస్యలను సావధానంగా విని, ఎంతో ఓపికతో వాళ్ళ సమస్యలను అర్థం చేసుకొని, వాటి పరిష్కారం కోసం పాటుపడిన ఒక అసామాన్యుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
ఎవరైనా తనకు ఉన్నదానిలో కొంత సమాజము కోసం ఇస్తే, వాళ్ళను దేవుళ్ళం అంటూ పొగుడుతాము అలంటిది తాను సంపాదించిన చాల భాగం వరకు ప్రజలకే, కష్టాల్లో ఉన్న వరకే దానధర్మాలు చేసిన శ్రీ పవన్ కళ్యణ్ గారిని ఏమనాలి? సాయం పొందిన వారు బయటకొచ్చి, మాకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సాయం చేసారు అని చెప్తే కానీ మనకు తెలియని సందర్భాలు కోకొల్లలు. తాను ఒక అగ్రనటుడు, కోట్లు సంపాదించగల వ్యక్తి అని మరచి, ఒక సామాన్యుడు వలె మనలో కలిసిపోయాడు. ఇంకా చెప్పాలంటే, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఊహించలేని అతి సాధారణ జీవితం గడుపుతున్నారు. ఎటువంటి ఆడంబరాలు లేని అసామాన్య వ్యక్తి.
శ్రీ పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగం నుండి రావడం వలన, వేరే నటుడు/నటి యొక్క అభిమానులకు ఉన్న కొన్ని సందేహాలు మరియు వాటికి మా సమాధానాలు.
సినిమాలు చేయడం ద్వారా చేయకలిగిన సేవ :
1. మీరు అభిమానించే నటుడు/నటి చేసే సినిమా ద్వారా, మీ జీవితాలు మారినాయా?
2. మీరు అభిమానించే నటుడు/నటి ద్వారా ఎంతమందికి సేవ చేయకలిగారు లేక వాళ్ళు ఎంతమందికి సేవ చేయకలిగారు?
3. మీరు అభిమానించే నటుడు/నటి ద్వారా, రాష్ట్రంలోని సమస్యలు తీరినయ? వాటికి పరిష్కార మార్గం ఏమైనా దొరికిందా?
4. మీరు అభిమానించే నటుడు/నటి చెప్పిన వ్యక్తికి, మీరు ఓటు వేయడం ద్వారా రాష్ట్ర భవిష్యత్తు మారిందా? లేక మీరు కోరుకున్న మార్పులు ఏమైనా వచ్చినాయా?
5. లేక శ్రీ పవన్ కళ్యాణ్ గారి కొంతమంది అభిమానులు వలన మేము అతనికి ఓటు వేయలేదంటారా?
అభిమానించే ప్రతి వ్యక్తి అభిమాని కాలేడు, అభిమాని అయినా ప్రతి వ్యక్తి కార్యకర్త కాలేడు, కార్యకర్త అయినా ప్రతి వ్యక్తి అనుసరణీయుడు కాలేడు, అనుసరణీయుడు అయినా ప్రతి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ కాలేరు.
2019 లో జరిగిన ఎన్నికల్లో, జనసేనకు 22 లక్షల ఓట్లు పడ్డాయంటే, 22 లక్షలమంది శ్రీ పవన్ కళ్యాణ్ గారులు ఉన్నారని కాదు. ఎవరిదారి వారిది, ఎవరి అభిమానం వారిది. ఎవరి పని వారిది. ఎవరి జీవితం వారిది. కానీ వీళ్లంతా శ్రీ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ఆశయాలను గౌరవిస్తూ, సమాజాన్ని మార్చాలనే ఉద్దేశంతో తమ వంతు ప్రయత్నంగా, తమ ఓటు హక్కును జనసేనకు వేసి మార్పులో భాగం అయ్యేందుకు ముందుకు కదిలిన ఆశయ సాధకులు.
వీళ్లందరినీ శ్రీ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ఆశయాలు ఒక్కటి చేసి, ఆవిధముగా అందరిని రాజకీయాలవైపు ఒక్కటిగా ముందుకు తీసుకెళ్లడానికి దోహదం చేసాయి. నేను శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమాని చెప్పి ఒక తప్పు చేస్తాను, అప్పుడు అది శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసినట్లేనా? అంటే, నేను ఆ పరమేశ్వరుణ్ణి భక్తుడిని, ఆయన్ని పూజిస్తాను… కావున నేను తప్పు చేస్తే ఆయన చేసినట్లేనా? ఎవరి వ్యక్తిగత నిర్ణయాలు, తప్పులు వారి వ్యక్తిగతం. ఒకతను తప్పు చేసారు, అతను శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమాని అయినంత మాత్రం చేత, శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసినట్లేనా? అభిమానులు వాళ్ళ అభిమానం ఎలాగైనా చూపించుకోవచ్చు, దానికి మనం విభేదించాల్సింది, ఆ తప్పు చేసిన వ్యక్తితో కానీ… శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మరియు ఆయన ఆశయాలతో కాదు. చాల సందర్భాలలో శ్రీ పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పారు, “నాకు రాజకీయంగా ప్రత్యర్థులే ఉంటారు కానీ శత్రువులు కాదు” అని. ఒకానొక సందర్భంలో శ్రీ అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ “నేనైతే ఆ హీరో సినిమా పోతే బాగుండు అని అనుకున్న కొన్ని సందర్భాలలో, కానీ కళ్యాణ్ గారు అలా అనుకోకూడదు. వాళ్ళ సినిమా కూడా బాగా ఆడాలి అప్పుడే సినీ పరిశ్రమ బాగుంటుంది, అందరు బాగుంటారు” అని చెప్పారు. ఇంతటి గొప్ప వ్యక్తిత్వం గల శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఎవరు అభిమానించకుండా ఉండలేరు. ఈరోజుకి సేవ కార్యక్రమాల నుండి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడానికి ఆయనే స్ఫూర్తి. ఎందరో IAS లాంటి ఉన్నత స్థాయిలో సాధించడానికి ఆయనే మార్గదర్శి. చదివింది ఇంటర్మీడియట్ వరకే కావొచ్చు కానీ ఆయన జ్ఞాన సముపార్జన చూస్తే, ఒక దేశాన్ని పాలించే వ్యక్తికి ఉండాల్సినంత జ్ఞానాన్ని సంపాందించి ఇప్పటికి కూడా నిత్య విద్యార్థిలా ఉంటారు. దేశాన్ని అమితంగా ప్రేమించే ఒక సైనికుడు. ప్రకృతిని వ్యవసాయాన్ని ఇష్టపడే ఒక మాములు రైతు. అన్ని మతాలను గౌరవిస్తూనే, తన మతాన్ని విశ్వసించే ఒక తాత్వికుడు. ఆయన పుట్టినరోజున దేశంలో ఎన్నో సేవ కార్యక్రమాలు జరుగుతాయి. సినిమాలు, రాజకీయాలు ఎంత మాత్రం ఒకటి కాదు. సినిమాలో ఉంటే, పదిమందికి ఆర్ధికంగా సాయం చేయగలరు కానీ, ఒక రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను తీర్చలేరు. నా అభిమాన నటుడికి పోటీగా ఉన్న నటుడు రాజకీయాల్లోకి వచ్చాడు కావున మనం అతనికి ఓటు వేయకూడదు మరియు అతనికి మన సంఘీభావం తెలపకూడదు అని భావించే కొంతమంది అభిమానులకు విన్నపం..
శ్రీ పవన్ కళ్యాణ్ గారు, రాజకీయంగా వచ్చే హోదాలను అనుభవించాలని ఎంతమాత్రం రాజకీయాల్లోకి రాలేదు. ఆయన ఎప్పుడు ఒకమాట చెప్తుంటారు “రాజకీయాలంటే బాధ్యతో కూడిన పదవి మరియు ప్రజలకు సేవ చేసే ఒక ఉద్యోగం మాత్రమే కానీ ప్రజలను పాలించడం మాత్రం కాదు” అని. మీరు అభిమానించే నటుడు/నటి సినిమాలో సంపాదించినా డబ్బుల ద్వారా ఎంత సేవ చేసారో కానీ, పైన తెలిపిన విధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, సాయం పొందినవారు చెప్తే కానీ మనకు తెలియనటువంటి సందర్భాలు ఎన్నో. మరి అటువంటి నిస్వార్థ వ్యక్తిత్వమున్న ఒక మంచి మనిషి, మన జీవితాలను మార్చడానికి రాజకీయాల్లోకి వస్తే మనం చేయవల్సిందేమిటి? మీరు అభిమానించే నటుడు/నటి లను ఎంతమాత్రం తక్కువ చేయడంలేదు. మీరు అలా భావిస్తే మమ్మల్ని క్షమించాలి. సినిమాలో కోట్ల రూపాయల ఆదాయాన్ని తృణప్రాయంగా వదిలి, ప్రజాసేవను చేద్దామనుకున్న ఈ మంచి వ్యక్తిని మనం ఓటు వేసి గెలిపిస్తే, మనం రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం.
శ్రీ పవన్ కళ్యాణ్ గారిని చట్టసభలలోకి పంపించి ఉంటే :
1. ఈరోజు రాష్ట్రంలో “సుగాలి ప్రీతీ” లాంటి ఒక ఆడ బిడ్డకు ఈవిధంగా అన్యాయం జరిగుండేది కాదు. సత్వరమే న్యాయం జరిగేలా మరియు నిందితులను శిక్షించేలా చర్యలు తీసుకునేవారు.
2. అన్యాయం జరిగిన వెంటనే నిందితులకు శిక్షలు అమలుపరచి, బాధితులకు తగినవిధంగా న్యాయం చేసుండేవారు.
3. విద్య వైద్యం అనేవి ఎంతో గొప్పవి. అవి ప్రైవేట్ పరం లేకుండా, ప్రభుత్వమే బాధ్యతతో నిర్వహించుండేది. మెరుగైన విద్య, తద్వారా చదివిన చదువులకు ఉద్యోగ కల్పనలు జరిగుండేవి. ధనిక పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం జరుగుండేది.
4. ప్రభుత్వపరంగా జరగాల్సిన ప్రతి అభివృద్ధి పనిని ఎంతో భాద్యతగా, అందరికి అందుబాటులో ఉండే విధంగా, అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూసేవారు. కులం మతం ప్రాంతం అనేవాటికి తావే లేకుండా పాలించేవారు.
5. ప్రభుత్వంలో అవినీతిని ఎంత వీలైతే అంత వరకు అరికట్టేవారు.
6. ఎన్నో సంవత్సరాలనుండి పీడించే ఎన్నో సమస్యలకు(ఉద్దానం లాంటి), శాశ్వత పరిష్కారమా కోసం కృషి చేసేవారు.
7. అవినీతి, దౌర్జన్యం, గూండాగిరి లాంటివి అరికట్టేవారు.
8. రైతుల దగ్గర నుండి టీచర్ల దగ్గర వరకు ప్రతి ఒక వృత్తి వరకు న్యాయం జరిగేలా, వాళ్ళ సమస్యలను తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకునేవారు.
9. ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని ఉద్దేశంతో, నైపుణ్య తరగతులు నిర్వహించేవారు. తద్వారా కొత్త కంపెనీలను ఆహ్వానించి, అందరికి ఉద్యోగాలు కల్పించడంతో పాటు వలసలను అరికట్టేవారు.
10. చిన్నతరహా, మధ్య తరహా వ్యాపారాలను ప్రోత్సహించి వాళ్ళను వ్యాపారం విస్తరించి లాభాలను గడించేలా చర్యలను తీసుకునేవారు.
11. ప్రకృతిని కాపాడుకుంటూ, టూరిజంను అభివృద్ధిపరచి, జల వనరులను సక్రమంగా వినియోగించుకుంటూ, పోలీస్ వ్యవస్థకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే హక్కును కల్పిస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించుండేవారు..
12. సామాన్యుడు సైతం, తప్పు జరిగినప్పుడు తమ అధికారిని ప్రశ్నించే విధంగా పారదర్శకత గల పాలన అందించేవారు.
ఈవిధంగా ఒక రంగంలోనే కాదు, ప్రభుత్వపరంగా ఎన్నైతే చేయగలరో, అన్ని పనులు చేయగల సమర్థుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ సినిమా నటుడుగా, తాను సంపాదించినా డబ్బు ద్వారా చేయలేరు. ఇవన్నీ కేవలం ఒక ప్రజా అధికారి అయ్యి, రాజకీయాల ద్వారా మాత్రమే చేయగల పనులు. “భరత్ అనే నేను” సినిమాలో శ్రీ మహేష్ బాబు గారు తెలిపిన ప్రకారం, ఒక ముఖ్యమంత్రి స్థాయి గల వ్యక్తి ఏమి చేయగలడో చిటికిలేస్తూ చెప్పారు. అందరు చప్పట్లు కొట్టి, మాకు ఇలాంటి నాయకుడు కావాలి అని 2:30 సినిమా చూసి, మళ్ళి మాములైపోయాము. మరి అలాంటి వ్యక్తి, మన కళ్ళెదురుగా ఈరోజు నిలబడినప్పుడు, కనీసం మన ఓటు హక్కు వినియోగించి మన సంఘీభావం తెలపాల్సిన అవసరం లేదా? మనం పుస్తకాల్లో చదివిన ఒక గొప్ప వ్యక్తి, ఉదాహరణగా ఈనాడు మన కళ్లెదుటే ఉన్నాడు. గుర్తించి, అతనికి మన సంఘీభావం తెలిపి మన జీవితాలను మరియు మన తరువాతి తరం జీవితాలను ఒక మంచి మార్గంలో వెళ్లేలా మన వంతు ప్రయత్నంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మన సంఘీభావం తెలుపుదాము. మార్పులో భాగస్వామ్యం అవుదాం. తన జీవితాన్నే ఒక మార్గదర్శకంగా చూపెడుతున్న ఈ నిస్వార్థమైన మంచిమనిషిని అనుసరించి, మార్పులో భాగమై తద్వారా అవినీతి, అక్రమాలు, అన్యాయాలు….లేని ఒక కొత్త సమాజానికి పునాది పడేలా పాటుపడదాం. జై హింద్…..
by
కొన్ని పాటి రవి
ట్విట్టర్ ఐడి : @KPR_India