
చిత్తూరు, (జనస్వరం) : జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి సుభాషిణి, మహిళ నాయకురాలు శ్రీమతి కోకిల గారి సూచనల మేరకు చంద్రగిరి నియోజకవర్గ నాయకులు దేవర మనోహర, తిరుపతి మండల అధ్యక్షులు రాయల్ వెంకట్ గారి సమక్షంలో పంచాయతీలోని యువరాజ్, శేఖర్ ఇతర స్థానిక నాయకులు నిర్వహించిన చలివేంద్రం ప్రారంభోత్సవానికి చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ఘనంగా ప్రారంభించారు. పంచాయతీలోని ప్రజలకు చేరువుగా, వేసవిని దృష్టిలో పెట్టుకొని దాదాపు వెయ్యి మంది ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేశామని స్థానిక నాయకులు వివరించారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు విచ్చేసి జయప్రదం చేశారు.