
అనంతపురం, (జనస్వరం) : ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీ స్థాయి మీరు తెలుసుకోకుండా ఉత్తర ప్రగల్భాలు పలకండి. నీకు ఒకరిని ఓడించే శక్తి కానీ, ఒకరిని గెలిపించే సామర్థ్యం కానీ లేదు? నీ స్థాయికి మించిన మాటలు మాట్లాడొద్దు? నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపించు. అధికార మదమెక్కి మహిషాసురునిలాగా మాట్లాడితే నీకు కొమ్ములు విరుస్తాం అని అనంతపురం జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి బొమ్మన పురుషోత్తమ రెడ్డి ధ్వజమెత్తారు. జరగబోయే ఎన్నికల్లో నీవు ఎక్కడ నుంచి పోటీ చేసినా మా వీర మహిళలు చాలు నీకు… కారం వేసి దంచి కొడతారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మసులుకో. వడ్డీ వ్యాపారం చేసుకుని తాకట్టు కోసం పత్రాలు పెట్టుకొని అక్రమంగా సంపాదించిన నీ జీవితం ఒక జీవితమా? నిజాయితీపరుడైన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి బొమ్మన పురుషోత్తమ రెడ్డి, సింగనమల మండల నాయకులు సాయి శంకర్, మధు శేఖర్, శేషు, ధనుంజనేయులు, మాధవ, పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు.