
ఆత్మకూరు, (జనస్వరం) : నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండల పరిధిలోని చుంచులూరు ఎస్సి కాలనిలోని బోటిక శ్రీనివాసులు, మాళిని అనే దంపతులకు శ్రీహన్(4 సం), హర్షవర్ధన్ (3సం)అనే ఇద్దరు కుమారుడులు, నాగలోహిత(2సం) అనే కుమార్తె జన్మించినారు. వీళ్ళకి జనటిక్ ప్రాబ్లెమ్ వలన పూర్తిగా నడవలేని పరిస్థితి ఏర్పడింది. హాస్పిటల్ లో వైద్య ఖర్చుల నిమిత్తం జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఇంచార్జి డబ్బుకొట్టు నాగరాజు యాదవ్ 10,000 వేల రూపాయలు చిన్నారుల తల్లితండ్రులకు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయుకులు, మర్రిపాడు మండలం ప్రధాన కార్యదర్శి సునీల్ యాదవ్, గుమ్మలపాటి మదన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.