Search
Close this search box.
Search
Close this search box.

జనసేన రాజకీయ “షణ్ముఖ వ్యూహం”

జనసేన

              జనసేన పార్టీ 9 వ ఆవిర్భావ దినోత్సవం రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సమర శంఖం పూరించిన వేదిక గా నిలిచింది. తొమ్మిదేళ్ల ప్రస్థానాన్ని వివరిస్తూనే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, వైఖరిని స్పష్టంగా అధినేత తెలియచేస్తూనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, రాజధాని భూములు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి – అప్పులు, మద్యం పాలసీలు, PRC, ఇసుక, CPS రద్దు, నిరుద్యోగుల స్వయం ఉపాధి, ఉద్యోగుల జీతాల వెతలు, ఎయిడెడ్ స్కూల్స్ మూసివేత అన్ని సమస్యలపై తన గళం ఎత్తారు. అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికాసానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రుణ విముక్తి కల్పించి ఆర్థికాభివృద్ధి సాధన కోసం జనసేనాని ప్రకటించిన “షణ్ముఖ వ్యూహం”. 
◆ బలమైన కొత్త పారిశ్రామిక విధానం తీసుకురావడం, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించటం.
◆ అమరావతిని అభ్యుదయ రాజధానిగా తీర్చిదిద్దుతూ, విశాఖ, విజయవాడ, తిరుపతిలను హైటెక్‌ నగరాలుగా తీర్చిదిద్దడం.
◆ కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య గారి పేరు నామకరణం.
◆ తెల్ల రేషన్‌ కార్డుదారులందరికీ గృహ నిర్మాణానికి ఇసుకను ఉచితంగా అందించడం.
◆ జనసేన సౌభాగ్య పధకం ద్వారా నిరుద్యోగులకు స్వయం ఉపాధి పొందుతూ, ఇతరులకు కూడా ఉపాధి కల్పించే వారికి ప్రభుత్వం తరుపున రూ.10 లక్షలు అందించడం.
◆ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు పంటలకు గిట్టుబాటు ధరలు ఇస్తూ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, పంట కాల్వలు నిర్మించడం.
◆ ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడం, ఉద్యోగులకు సీపీఎస్‌ను విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించడం.
             అధికార పార్టీ దురహంకారాన్ని ఎండగడుతూ కొత్త ప్రజా ప్రభుత్వం స్థాపిస్తాం అంటూ ఆవిర్భావ సభ నుండే అధినేత పార్టీ శ్రేణులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. జనసేనాని యుద్ధానికి సిద్ధం అంటే జన సైన్యం యుద్ధ నీతిని అనుసరించాలి. అస్త్రాలను సిద్ధం చేసుకోవాలి పోరాటాలకు సిద్ధ పడాలి. రాజకీయం అంటే ఎత్తులు, వ్యూహాలు తప్పనిసరి ఈ క్రమంలో ప్రత్యర్ధుల ఉచ్చులో పడకుండా ఉండాలి విచక్షణ కోల్పోకుండా వ్యవహరించాలి. పార్టీకి ఉన్న బలం కలలు సాకారం చేసుకోగలిగే శక్తి సామర్ధ్యాలు మెండుగా ఉన్న యువత. ఆ యువత ఆవేశాన్ని ఆలోచనగా మార్చుకోవాలి. ఆలోచనను ఆచరణ దిశగా మలుచుకోవాలి. అధికార పార్టీ వ్యతిరేక శక్తులన్నీ వ్యక్తిగత ప్రయోజనాలను విడిచి రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి వస్తే పొత్తుల గురించి ఆలోచిస్తామని అధినేత చెప్పటం తప్పు కాదు. అది రాజకీయ పరిణామాల దృష్ట్యా జరగాల్సిన ప్రక్రియ. ఎప్పటి గురించో ఊహాగానాలు చేయటం సబబు కాదు అధినేత పై విశ్వాసంతో నడవటం ముఖ్యం. ప్రభుత్వ విధానాలే మన ముందు ఉన్న మార్గాలు తప్పుడు నిర్ణయాల పట్ల వ్యతిరేకత మనకు అందివచ్చిన అవకాశాలు. వ్యతిరేకతను ఓటుగా మలుచుకొనే నేర్పు రావాలి. అధినేత నిర్ణయాల పట్ల ఓర్పు కావాలి. భవిష్యత్తు రాజకీయాధికారానికి బాటలు వేస్తూ మన విజయానికి సోపానాలు వేసుకోవాలి.“భవిష్యత్తు జెండాను మోయటం కంటే బాధ్యత ఏముంటుంది ఒక తరం మార్పుకోసం యుద్ధం చేయటం కంటే సాహసం ఏముంటుంది?”. 

– టీం నారీస్వరం 

One Response

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20240403-WA0002
ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటుతోనే రాష్ట్ర అభివృద్ధి : జనసేన నాయకురాలు పెండ్యాల శ్రీలత
IMG-20240331-WA0016
జనసేన పార్టీలోకి కొనసాగుతున్న వలసలు
IMG-20240319-WA0007
అంగరంగ వైభవంగా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం
IMG-20240318-WA0009
ఉమ్మడి అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి : జనసేన నాయకులు పేడాడ రామ్మోహన్
IMG-20240315-WA0303
జనసేన నాయకులు వాసగిరి మణికంఠ ఆధ్వర్యంలో అల్పాహార పంపిణీ

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way